
హైదరాబాద్: ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్‌తో పాటుగా ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు కూడా షాక్..! షార్ట్ ఫార్మాట్‌లో దూకుడుగా చెలరేగి ఆడే ఆరోన్ ఫించ్ పాకిస్తాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైయ్యాడు. ఇంతకుముందెన్నడూ ఫించ్‌కు టెస్టుల్లో ఆడిన అనుభవం లేదు. 31ఏళ్ల ఈ క్రికెటర్ల 135 మ్యాచ్‌ల షార్ట్ ఫార్మాట్‌లో ఆడాడు. ఇలా ఆస్ట్రేలియా రెండు టెస్టు సిరీస్‌లొ అతని పేరు వినిపించడంతో క్రికెట్ అభిమానులతో పాటుగా ఫించ్ కూడా ఆశ్చర్యానికి గురైయ్యాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న ఆస్ట్రేలియా జట్టులో ఆరోన్ ఫించ్ బ్యాటింగ్‌కు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడోననే సందేహం నెలకొంది. 'ఇప్పటి వరకూ షార్ట్ ఫార్మాట్‌లో ఆడిన నేను టెస్టు జట్టులో ఏ స్థానానికి సరిపోతానో నిర్ణయించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్‌లో ఆడగలననే నమ్మకంతో నన్ను ఎంపిక చేశారు. ఒక వేళ నేను టాప్ ఆర్డర్‌లో దిగాలి అనుకుంటే నా సహజ ఆటతీరునే కొనసాగిస్తా. అలా కాకుండా మిడిల్ ఆర్డర్‌లో దిగాల్సి వస్తే స్పిన్‌ను దాంతో పాటు రివర్స్ స్వింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.'
'ఈ విషయంపై మరో వారం రోజుల్లో ప్రధాన కోచ్ తోనూ కెప్టెన్‌తోనూ చర్చించాల్సి ఉంది. చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్న తర్వాత జట్టుకు నేను పనికి వస్తానని టిమ్ పైనె, జస్టిన్ లాంగర్ నిర్ణయించుకున్నారు. కాబట్టి వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తా' అని ఫించ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
దశాబ్ద కాలం పాటు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్‌లలో కెప్టెన్‌గానూ బ్యాట్స్‌మన్‌గానూ ఫించ్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. '10నుంచి 12 ఏళ్లు క్రికెట్ ఆడటమంటే మనకి నచ్చినట్లుగా మ్యాచ్‌ను మార్చుకోవచ్చు. అది టెస్టు ఫార్మాట్.. పరిమిత ఓవర్ల మ్యాచ్ అనేది ప్రాధాన్యం కాదు' అని ఫించ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.