మొదటి ఇన్నింగ్స్ నేర్పిన పాఠాలతోనే తొలి టెస్టు విజయం

అడిలైడ్: భారత బ్యాట్స్‌మెన్ మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని, రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేశారని కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 31 పరుగులతో చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఆసీస్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకుంది. ఈ విజయంపై ఇప్పటికే పలువురు హర్షం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ల ద్వారా తెలిపారు. ఇక ఈ విజయాన్ని ఉద్దేశించి టీమిండియా కోచ్ శాస్త్రి ఇలా మాట్లాడాడు.

గతంలో ఫలితాలు పునరావృతం కాకూడదని
మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నారు. ఆ తప్పుల నుంచి నేర్చుకుని కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యయుతంగా ఆడారు. ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి టెస్టులో గెలుపు ముంగిట 31 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయాం. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులోనూ 72 పరుగులతో ఓటమిపాలయ్యాం. ఈ సారి ఆలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా విజయంతో సిరీస్‌ను ఆరంభించడం సంతోషంగా ఉంది.

నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో
250 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో భారత బౌలర్లు అద్బుతంగా రాణించారని శాస్త్రి అన్నాడు. ఇలా క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే.. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ 291 పరుగులకు ఆలౌటైంది. 104/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను టీమిండియా బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు.

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి
మరో 31 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్ 120వ ఓవర్లో హేజిల్‌వుడ్ వికెట్ తీశాడు. దీంతో ఆసీస్ 291 పరుగులకే ఆలౌట్ అయింది. పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్టు డిసెంబరు 14 నుంచి ప్రారంభం కానుంది. మరో 4 రోజులే ఉండటంతో ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమని అతడన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications