‘కోచ్‌గా నన్ను ఎంపిక చేయండి.. కోహ్లీని దారిలో పెడతా’
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లేని అవమానకరీతిలో కోచ్ పదవి నుంచి తప్పుకునేలా చేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీకి బుద్ధి చెప్పాలని ఓ అభిమాని భావించాడు. వృత్తిపరంగా తాను మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు.
టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లే తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారా? అని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోచ్ రేసులో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు టామ్ మూడీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

నేను కోచ్ పదవికి అర్హుడినే
ఈ క్రమంలో కోచ్ పదవికి తానూ అర్హుడినేనంటూ ఓ నిర్మాణ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. అంతేకాదు 'అహంకారి అయిన కోహ్లీని సరైన దారిలో పెట్టేందుకే' తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అతడు తెలిపాడు.

కోహ్లీకి లెజండరీ క్రికెటర్లు కోచ్‌గా అవసరం లేదు
'లెజండరీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాను. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లెజండరీ క్రికెటర్లు కోచ్‌గా అవసరం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం మరోసారి మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా ఎంపిక చేసినా.. కుంబ్లే తరహాలోనే ఆయనను కూడా కోహ్లీ అవమానిస్తాడు' అని పేర్కొన్నాడు.

కోచ్ పదవికి నేనే పర్ఫెక్ట్ చాయిస్
'కాబట్టి ఎలాంటి క్రికెట్ నైపుణ్యం లేకున్నా నేనూ టీమిండియా కోచ్ పదవికి అర్హుడినే. కోచ్ పదవికి పర్ఫెక్ట్ చాయిస్. అహంకార పూరిత వైఖరితో నేను సర్దుకోగలను. నాకు తెలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్ద పేరున్న వ్యక్తి కోచ్‌గా రావాలని అనుకుంటున్నాడు. నా పేరు చాలా పెద్దది. మెల్లగా కోహ్లీని నేను సరైన దారిలోకి తీసుకొస్తాను. ఆ తర్వాత బీసీసీఐ మాజీ క్రికెటర్లను కోచ్‌గా ఎంపిక చేసుకోవచ్చు' అని బ్రహ్మచారి తన దరఖాస్తులో పేర్కొన్నాడు.

కుంబ్లేను తొలగించడానికి కోహ్లీయే కారణం
కోచ్ పదవి నుంచి కుంబ్లేను తొలగించడానికి కోహ్లీయే కారణమని దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు అనుకుంటున్నట్టే తాను భావిస్తున్నట్టు అతను తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ వెబ్‌సైట్‌లోని ఈమెయిల్ ఐడీ ఆధారంగా అతను ఈ దరఖాస్తు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications