న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నిజం చెప్పాలంటే.. ఇరు జట్ల మధ్య తేడా కోహ్లీ, పుజారాలే'

India vs Australia: Cheteshwar Pujara and Virat Kohli Difference Between 2 Sides
To be frank, Cheteshwar Pujara and Virat Kohli have been the difference: Justin Langer

హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా విరాట్‌ కోహ్లీ, పుజారాలేనని ఆసీస్‌ హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. తమ బ్యాటింగ్‌ లైనప్‌లో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని బాక్సింగ్ డే టెస్టు ఓటమి అనంతరం జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018: కోహ్లీతో సహా మొత్తం ఐదుగురువన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018: కోహ్లీతో సహా మొత్తం ఐదుగురు

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 137 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన జస్టిన్ లాంగర్ "నిజం చెప్పాలంటే ఈ దశలో సిరీస్‌లో ప్రధాన తేడా పుజారా, కోహ్లీ" అని అన్నాడు.

"తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సగటు 53, కోహ్లీ సగటు 46. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయలేదు. దీని నుంచి మేం నేర్చుకున్న పాఠం వారు ఒత్తిడిని అధిగమించారు. బ్యాటింగ్‌ అనేది ఒక కళ. ఇందులో ఒత్తిడిని ఆస్వాదించడం కీలకం. టెస్టు క్రికెట్‌లో చాలా సమయం ఉంటుంది. ప్రస్తుత టీ20 యుగంలో అన్నీ త్వరగా, వెంటనే కావాలి" అని అన్నాడు.

"పైగా స్ట్రైక్‌ రేట్‌ గురించి మాట్లాడుతున్నారు. మా కుర్రాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. అలా జరక్కపోతే ఇలాంటి ఓటములే ఎదురవుతాయి. మెల్‌బోర్న్‌ టెస్టు చాలా కఠినంగా సాగింది. మేం పూర్తిగా అలసిపోయాం. నాలుగో టెస్టు ముందు విశ్రాంతి అవసరం. ఆరోన్ ఫించ్‌లో నిలకడ లోపించింది. మిడిలార్డర్‌ సైతం ఇదే సమస్యతో సతమతం అవుతోంది. సిరీస్ గెలవకుండా డ్రాతో టీమిండియాను పంపిస్తే మాకు బాగుంటుంది" అని లాంగర్ చెప్పుకొచ్చాడు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 13 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల సిరిస్‌కు ఆసీస్ పేస్ బౌలర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్, జోస్‌ హేజెల్‌వుడ్‌ దూరమయ్యారు.

ఈ ముగ్గురికి విశ్రాంతిని ఇవ్వడంపై ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "ఎవరిని ఎంపిక చేయాలో గందరగోళంగా ఉంది. మా బౌలర్ల పనిభారాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. ఆ ముగ్గురికి వన్డే సిరీస్‌లో విశ్రాంతినిస్తే తర్వాతి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉంచగలం. బాక్సింగ్ డే టెస్టులో కమిన్స్‌ అద్భుతంగా ఆడాడు. ప్రతి మ్యాచ్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేయరని మీరు ప్రశ్నిస్తారు? కానీ మనకు వచ్చే ఏడాది వరల్డ్‌కప్, యాషెస్‌ ఉన్నాయి" అని అన్నాడు.

Story first published: Monday, December 31, 2018, 19:28 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X