Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

TNPL 2022 : వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ రద్దు.. జాయింట్ విన్నర్స్‌గా లైకా కొవై కింగ్స్, చెపక్ సూపర్ కింగ్స్

TNPL 2022 : Final Match Abandoned Due To Rain, Lyca and Chepak are Joint Winners

తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చెపాక్ సూపర్ గిల్లీస్ మరియు లైకా కోవై కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో ఇరు జట్లను జాయింట్ విజేతలుగా నిర్వాహకులు ప్రకటించారు. తొలుత వర్షం వల్ల ఆటను 17ఓవర్లకు కుదించారు. మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 17ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138పరుగులు చేయగలిగింది. ఇక ఆ జట్టు బ్యాటర్లలో సాయి సుదర్శన్ (42బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్‌తో 65పరుగులు) హాఫ్ సెంచరీతో అలరించాడు.

అతనితో పాటు గంగ శ్రీధర్ రాజు (27), షరూఖ్ ఖాన్ (22) రాణించారు. ఇక 30 CSG బౌలర్లలో వారియర్ 4వికెట్లు, సాయికిషోర్ 3, సోనూ యాదవ్ 2 వికెట్లు తీసి లైకా బ్యాటర్లను కట్టడి చేశారు. 139పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెపక్ సూపర్ గిల్లీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కౌశిక్ గాంధీ (1), జగదీషన్ (2) పరుగులకే ఔటయ్యారు.

4ఓవర్లు పూర్తయ్యే సరికి సీఎస్జీ 2వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేయగలిగింది. ఈ టైంలో మళ్లీ వర్షం ఊపందుకుంది. ఇక ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లను విన్నర్లుగా ప్రకటించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సందీప్ వారియర్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సంజయ్ యాదవ్ నిలిచాడు.

తుదిజట్లు :
చెపక్ సూపర్ గిల్లీస్ : కౌశిక్ గాంధీ (కెప్టెన్), N జగదీశన్ (వికెట్ కీపర్), S రాధాకృష్ణన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉత్తిరాసామి ససిదేవ్, రాజగోపాల్ సతీష్, S హరీష్ కుమార్, సోను యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, R అలెగ్జాండర్, సందీప్ వారియర్
లైకా కొవై కింగ్స్ : గంగా శ్రీధర్ రాజు, J.సురేష్ కుమార్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షిజిత్ చంద్రన్, షారుక్ ఖాన్ (కెప్టెన్), U ముకిలేష్, అభిషేక్ తన్వర్, వల్లియప్పన్ యుధీశ్వరన్, మనీష్ రవి, S అజిత్ రామ్, బాలు సూర్య

Story first published: Monday, August 1, 2022, 7:52 [IST]
Other articles published on Aug 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+