Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నువ్వో గొప్ప క్రికెటర్‌వి.. అంతకుమించి గొప్ప మనిషివి’.. కోహ్లీకి డివిల్లీర్స్ బర్త్ డే విషెస్!

Title: You are a great cricketer and a great human being says de villiers on virat kohli birthday

టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 34వ బర్త్‌డేని అభిమానులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న కోహ్లీ.. జింబాబ్వేతో చివరి గ్రూప్ మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ చేరుకున్నాడు. అక్కడే జట్టు సభ్యుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కోహ్లీకి అభిమానులు, స్నేహితుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఆర్సీబీ ట్వీట్స్..

మోడర్న్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ కోహ్లీకి బర్త్ డే చెప్తూ అద్భుతమైన ఆర్ట్‌ను షేర్ చేసింది. అలాగే 15 ఏళ్లుగా కోహ్లీ ఎరాలో జీవిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఒక వీడియో కూడా షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

బెస్ట్ ఫ్రెండ్స్..

కోహ్లీతో కలిసి ఐపీఎల్‌లో ఆడిన సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లీర్స్.. అతనికి బెస్ట్ ఫ్రెండ్ కూడా. వీళ్లిద్దరూ మైదానంలోనే కాదు, బయట కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కోహ్లీ ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కూడా డివిల్లీర్స్ అతనికి మద్దతుగా నిలిచాడు. ఆ తర్వాత కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత అందరి కంటే ముందుగా సంతోషం వ్యక్తంచ చేసిన వాడు కూడా డివిల్లీర్సే కావడం గమనార్హం.

డివిల్లీర్స్ విషెస్

ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి డివిల్లీర్స్ బర్త్ డే విషెస్ చెప్పాడు. ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన వీడియోలో డివిల్లీర్స్ మాట్లాడుతూ.. 'హలో వి, మై బిస్కట్. నువ్వు క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నా. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా. నేను ఇక్కడ కూర్చొని నీకు బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది. నువ్వు ఈ రోజును అద్భుతంగా గడపాలని కోరుకుంటున్నా. నువ్వో అత్యుత్తమ క్రికెటర్‌ ఆటగాడివి, అంతకుమించి అద్భుతమైన మనిషివి. నీ స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచకప్‌లో నీకు, నీ జట్టుకు ఆల్ ది బెస్ట్. టోర్నీలో మీరు చివరి వరకు వెళ్లాలని ఆశిస్తున్నా. సౌతాఫ్రికాను ఫైనల్‌లో ఎదుర్కొంటారేమో? అదే జరిగితే చాలా బాగుంటుంది. ఏదేమైనా హ్యాపీ బర్త్‌ డే విర్రీ.. ఈ రోజు అద్భుతంగా గడుపు. చీర్స్' అని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Saturday, November 5, 2022, 11:06 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+