T20 World Cup: వన్డేల్లో కూడా ఇంత చెత్తగా ఆడలేదు.. వీళ్లసలు ఓపెనర్లేనా?

టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్టు ఏది? ఈ ప్రశ్న సరిగ్గా నెల రోజుల క్రితం అడిగితే దాదాపు అందరి మదిలో మొదటగా మెదిలిన పేరు ఇండియా. గ్రూప్ దశలో పెద్దగా బలమైన జట్లు లేకపోవడంతో సునాయాసంగానే సెమీస్ చేరిందా జట్టు. కోహ్లీ, సూర్యకుమార్ విజృంభణల మధ్యలో భారత్‌ను వేధిస్తున్న ఒక ప్రధానమైన సమస్య కనుమరుగైపోయింది. అదే ఓపెనింగ్..
కొత్త ఇంటెంట్ ఎక్కడ?
రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించిన తర్వాత రాహుల్ ద్రావిడ్ ఈ జట్టుకు కొత్త ఇంటెంట్ టెంప్లేట్ అందించాడు. దీని ప్రకారం తొలి ఆరు ఓవర్లలో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్‌ను ఓపెనర్లు పూర్తిగా ఉపయోగించుకోవాలి. భారీ షాట్లు ఆడుతూ పవర్‌ప్లే ముగిసే సరికి మంచి స్కోరు చేయాలి. ఇది భారత అభిమానులకు కొంచెం కొత్తగా అనిపించినా.. ఇంగ్లండ్ తదితర జట్లపై భారత ఆటతీరు వాళ్లను కూడా మెప్పించింది.
ఈ ప్రపంచకప్‌లో మరీ దారుణం
ఈ ప్రపంచకప్‌లో అత్యంత చెత్తగా ఆడిన ఓపెనింగ్ జోడీ ఏదైనా ఉందంటే అది భారత్‌దే. న్యూజిల్యాండ్ ఓపెనర్లు ఏకంగా 9.26 రన్ రేట్‌తో పరుగులు చేస్తే.. భారత ఓపెనర్లు అత్యంత పేలవంగా 4.8 రన్ రేట్‌తో స్కోర్ చేశారు. సూపర్-12 దశలో ఆడిన అన్ని జట్లలో మనదే అత్యంత తక్కువ రన్ రేట్. అంతేకాదు ఇప్పటి వరకు భారత్ ఆడిన అన్ని టీ20 ప్రపంచకప్‌లలో అత్యంత చెత్త ప్రదర్శన కూడా ఈ వరల్డ్ కప్‌లోనే నమోదైంది. ఈ టోర్నీలో ఒక్క బౌండరీ బాదేందుకు భారత ఓఫెనర్లకు సగటున కనీసం 9 బంతులు కావలసి వచ్చింది. 2007లో ఇది 6.4గా ఉంది. అంటే ప్రతి 6.4 బంతులకు అప్పట్లో ఒక బౌండరీ కొట్టారు. గతేడాది ప్రపంచకప్‌లో అత్యంత భారీగా ప్రతి 4 బంతులకు ఒక బౌండరీ బాదారు. ఈ ఏడాది చేతులెత్తేశారు. రన్ రేట్ కూడా కేవలం 6 పరుగులే కావడం గమనార్హం.
ఇదే అతి చెత్త రికార్డు
కొత్త ఇంటెంట్.. భారీ షాట్లు.. ఇవన్నీ కూడా పైపై మాటలే అని ఆసియా కప్‌లోనే అభిమానులకు అర్థమైపోయింది. ఓపెనర్లు చాలా చెత్తగా ఆడుతున్నారని తిట్టిపోయడం మొదలు పెట్టారు. ఇదే నిజం కూడా. భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది కదా. దానిలో పవర్‌ప్లేలో సచిన్ స్ట్రైక్ రేట్ 97.55, అదే టోర్నీలో సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 115.17. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ స్ట్రైక్ రేట్ 94.74కాగా, రాహుల్ స్ట్రైక్ రేట్ మరీ దారుణంగా 89.47. ఈ లెక్కలు చాలవా వాళ్లు ఎంత దారుణంగా ఆడారో చెప్పడానికి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications