Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: భారత్‌ను ఓడిస్తే.. జింబాబ్వే వాడిని పెళ్లి చేసుకుంటానన్న పాక్ నటి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

 Title: Pakistan actress says she will marry a zimbabwean guy if they defeat team india

పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. బంగ్లాదేశ్‌పై భారత్ విజయంతో పాక్ ఆటగాళ్లు దాదాపుగా సూట్‌కేసులు సర్దేసుకున్నారు. కానీ అధికారికంగా ఇంకా ఆ జట్టు సెమీస రేసు నుంచి తప్పుకోలేదు. ఇప్పటికీ పాక్ క్రికెట్ జట్టు అభిమానులు భారత జట్టును వెనక్కు నెట్టి తమ జట్టు సెమీస్ చేరాలంటే ఏం చెయ్యాలనే ఆలోచనలు చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌పై కూడా వాళ్లే ఎక్కువ ఫోకస్ చేశారనడం అతిశయోక్తి కాదు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడినందుకు ఎక్కువ హర్ట్ అయింది కూడా పాక్ అభిమానులే. అందుకే నెట్టింట భారత్ చీటింగ్ చేసిందంటూ ఆరోపణలు చేశారు.

పాక్ సెమీస్ చేరాలంటే..

లెక్క ప్రకారం ఇంకా సెమీస్ రేసులోనే ఉన్న పాకిస్తాన్.. సెమీఫైనల్ చేరడం, చేరకపోవడం రెండు అంశాలపై ఆధారపడి ఉంది. గురువారం నాడు సౌతాఫ్రికాను ఓడించి, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై కూడా పాక్ గెలిస్తే

ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయి. అయితే సెమీస్ బెర్తు మాత్రం కన్ఫర్మ్ అవదు. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ ఆరు పాయింట్లతో ఉంది. పాకిస్తాన్ వద్ద రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఈ రెండు జట్ల పాయింట్లు సమానం అవుతాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంది.

జింబాబ్వే మ్యాచ్ కీలకం..

వర్షం కారణంగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ మ్యాచ్ మధ్యలో ఆగింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో వర్షం కారణంగా పాకిస్తాన్ గెలిచి, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు రెడీ అయినా ఆ జట్టు సెమీస్ చేరడం అంత ఈజీ కాదు. ఎందుకంటే భారత్ కూడా మరో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. అది కూడా పసికూన జింబాబ్వేతో. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 8 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. అందుకే పాకిస్తాన్ అభిమానులంతా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. తమపై జింబాబ్వే జట్టు అద్భుతంగా ఆడి ఎలా ఓడించిందో.. భారత్‌ను కూడా అలాగే ఓడించాలని కోరుతున్నారు.

పాక్ నటి ఆఫర్..

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ కూడా ఇదే పద్ధతిలో ట్వీట్లు చేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో కూడా క్షణక్షణానికీ ట్వీట్లు చేస్తూ.. భారత్ ఓడిపోవాలని కోరుకుంది. ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పింది. 'జింబాబ్వే జట్టు కనుక తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే.. నేను ఆ దేశపు వ్యక్తినే పెళ్లి చేసుకుంటా' అని ట్వీట్ చేసింది.

నెటిజన్ల ట్రోలింగ్..

ఇది నెటిజన్లు ఎందుకు ఊరుకుంటారు. ఆమె అంతకుముందు చేసిన ట్వీట్లు చూపించి ట్రోల్ చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు కూడా ఇలాంటి ట్వీటే చేసిన ఆమె.. 'ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే నా ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసేస్తాను. మళ్లీ ట్విట్టర్ ముఖం కూడా చూడను' అన్నది. ఈ ట్వీట్‌ను ఆమెకు గుర్తు చేస్తున్న నెటిజన్లు.. 'ముందు ఈ మాట నిలబెట్టుకో. మిగతాది తర్వాత చూద్దాం' అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అదే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తన పేరు మార్చుకొని 'నరేంద్ర మోదీ' అని పెట్టుకుంటానంది. ఈ ట్వీట్లు చూపిస్తున్న నెటిజన్లు 'ఇంకా పేరు మార్చుకోలేదా?' అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Thursday, November 3, 2022, 16:56 [IST]
Other articles published on Nov 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+