
భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. పంత్ ఒత్తిడిని తట్టుకోగలడని, సహజమైన ఆటను ఆడేందుకు ఇష్టపడుతాడని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత కెప్టెన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కఠినమైన పరిస్థితుల నుంచి జట్టును గట్టేక్కించగల సామర్థ్యం రిషబ్ సొంతం అంటూ అరుణ్ లాల్ కొనియాడారు.
ఓమీడియా ఇంటర్వ్యూలో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ అరుణ్ లాల్ అనేక విషయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరూ అని అడిగితే.. ఎలాంటి సంకోచం లేకుండా పంత్ పేరును ప్రతిపాదిస్తానని అన్నారు. అతను ఆటను అస్వాధిస్తాడని.. ఒత్తిడిని తట్టుకోని క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల గొప్పనాయకుడని పేర్కొన్నారు. పంత్ వంటి ఆటగాడు దూకుడు ఆటగాడిగా కంటే కెప్టెన్ గా ఉంటే టీంఇండియాకు మేలు చేస్తుందని అరుణ్ లాల్ స్పష్టం చేశారు.
పంత్ నిలకడగా ఆడగలిగితే భారత జట్టుకు హీరో అవుతాడని బెంగాల్ మాజీ కోచ్ ధీమా వ్యక్తం చేశాడు. అతను రెడ్-బాల్ ఫార్మాట్‌లో బాగా ఆడితే.. వైట్-బాల్ ఫార్మాట్‌లో కూడా బాగా రాణించగల అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే టెస్ట్ క్రికెట్లో రాణిస్తే.. మిగతా ఫార్మాట్ లో రాణించేందుకు వీలుటుందన్నారు. అంతేకాక కెరీర్ ఆరంభంలోనే పంత్ ఢిల్లీ రంజీ ట్రోఫి జట్టుు కెప్టెన్ గా వ్యవహరించాడని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీక్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారని.. ఖచ్చితంగా భవిష్యత్ కెప్టెన్ అవుతాడని అరుణ్ లాల్ స్పష్టం చేశారు.