Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి భయం: 'ఈడెన్‌లో కావాలనే సమయం వృధా చేశా'

Time wasting tactics in Eden Test were intentional, concedes Niroshan Dickwella

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌‌తో జరిగిన తొలి టెస్టు చివరి రోజు తాను కావాలనే సమయం వృధా చేశానని శ్రీలంక క్రికెటర్ నిరోషాన్ డిక్వెల్లా ఒప్పుకున్నాడు. తొలి టెస్టును డ్రా చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఎత్తుగడలు అవలంభించినట్లు చెప్పాడు.

'ఓ వైపు వికెట్లు పడుతున్నాయి. భారత్‌లో ముగ్గురు అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. వికెట్‌ను కాపాడుకోవడం కంటే పేస్ బౌలింగ్‌లో ఎదురు దాడి చేయడమే మంచిదని అనిపించింది. షమీ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాను. నిబంధనలకు విరుద్ధంగా లెగ్ సైడ్‌లో స్క్వేర్ వెనుక ముగ్గురు ఫీల్డర్లు ఉన్న విషయం గుర్తించి అంపైర్ నిగెల్ లాంగ్‌కు చెప్పాను' అని డిక్వెల్లా అన్నాడు.

'దీంతో అంఫైర్ వెంటనే దానిని నోబాల్‌గా ప్రకటించాడు. వెంటనే కోహ్లీ నా దగ్గరకు వచ్చి అది అంపైర్ల పని, నీపని నువ్వు చూసుకో అన్నాడు. దీంతో తొలి టెస్టులో డ్రామా మొదలైంది' అని అన్నాడు. ఆ తర్వాత సమయం వృధా చేసేందుకు ఇదే సరైన అవకాశంగా భావించి... సమయం వృథా చేసేందుకు పదే పదే యత్నించినట్లు తెలిపాడు.

ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో బౌలింగ్ రన్నప్‌ విషయంలో గొడవ అయిందని డిక్వెల్లా తెలిపాడు. తాను సమయం తీసుకోవడం వేగంగా బంతులు వేయాలనుకునే భారత​ క్రికెట్‌ జట్టుకు నచ్చలేదని అన్నాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న మా కెప్టెన్ మాత్రం కామ్ ఉండి ఆటపై దృష్టి సారించమని చెప్పాడు.

దీంతో భారత జట్టులోని ఆటగాళ్లతో తాను ఎటువంటి వాగ్వాదానికి దిగలేదని డిక్వెల్లా అన్నాడు. ఇదిలా ఉంటే ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షమి బౌలింగ్‌లో పదేపదే బంతికి బంతికి మధ్య టైమ్ తీసుకుంటుండటంతో అతనికి కోపమొచ్చింది. దీంతో క్రీజులో ఉన్న డిక్‌వెల్లాపై షమీ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అతని దగ్గరికి వెళ్లి ఏదో మాటన్నాడు.

ఆ తర్వాతి బంతికి డిక్‌వెలా మళ్లీ అలాగే చేయడంతో ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా అంపైర్ దగ్గరికి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు అంపైర్లు కలిసి ప్లేయర్స్‌ను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే చివరిరోజైన సోమవారం ఆటలో భాగంగా 231 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 75 పరుగుల వద్ద ఉండగా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్‌ను అంఫైర్లు నిలిపివేశారు. దీంతో విజయం దిశగా పయనించిన కోహ్లీసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Story first published: Thursday, November 23, 2017, 15:42 [IST]
Other articles published on Nov 23, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+