హైదరాబాద్: బీసీసీఐలో సంస్కరణల పర్వం మొదలైంది. జస్టిస్ లోధా కమిటీ సూచించిన సిఫారసులకు అనుగుణంగా జాతీయ సెలక్షన్ కమిటీని కుదించే అవకాశముంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ సెలక్టర్లుగా ఉన్న గన్ ఖోడా, జతిన్ పరాంజపే ఉద్వాసనకు గురికానున్నారు.
ఆ అర్హత నాకు లేదు: బీసీసీఐ అధ్యక్ష పదవిపై గంగూలీ
ప్రస్తుతం జాతీయ సెలక్షన్ కమిటీలో టెస్టు అనుభవం లేని గగన్‌ఖోడా, జతిన్ సహా ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లు సభ్యులుగా ఉన్నారు. టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ముగ్గురు సభ్యుల సెలెక్షన్ ప్యానెల్ చాలని, సహాయకులుగా కొందరిని నియమించుకోవచ్చని లోధా ప్యానెల్ గతంలో సూచించింది.

అయితే లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో మాజీ టెస్టు ఆటగాళ్లు ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లు మాత్రమే సెలక్షన్ కమిటీలో కొనసాగనున్నారు.
గగన్‌ఖోడా, జతిన్ పరాంజపే జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోనున్నారు. వీరిద్దరికీ ఒక్క టెస్టు ఆడిన అనుభవం కూడా లేదు. గగన్‌ఖోడా రెండు వన్డేలాడగా, జతిన్ పరాంజపే భారత్ తరుపున నాలుగు వన్డేలాడాడు. దీంతో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం బీసీసీఐ వీరిద్దరిని సహాయకులుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనుష్క భుజంపై కోహ్లీ చెయ్యి: సోషల్ మీడియాలో వైరల్
గత సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీని నియమించింది. ఇదిలా ఉంటే జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టి20ల కోసం భారత జట్టును జనవరి 5న సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో చూస్తాను. సీనియర్ జట్టు ఎంపిక సమయంలో కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. అతడు లేని పక్షంలో సంయుక్త కార్యదర్శి ఆ బాధ్యతలు చేపడతారు' అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌధురి తెలిపారు.