Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ లేడు: శ్రీలంకతో టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా టిమ్ సౌథీ

Tim Southee to lead New Zealand in upcoming T20I series against Sri Lanka

హైదరాబాద్: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ లేకుండానే ఆ జట్టు శ్రీలంకతో టీ20 సిరిస్ ఆడనుంది. గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కేన్ విలియమ్సన్‌కు శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌ నుంచి కివీస్ సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

దీంతో సెప్టెంబర్ సెప్టెంబర్‌ 1 నుంచి శ్రీలంకతో పల్లెకెల వేదికగా ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌ నుంచి విలియమ్సన్ దూరం కానున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన ఆనంతరం కేన్ విలియమ్సన్ స్వదేశానికి బయల్దేరుతాడు.

కేన విలియమ్సన్‌తో పాటు సీనియర్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. విలియమ్సన్ స్థానంలో శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌కు టిమ్‌ సౌథీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కివీస్ సెలక్టర్‌ లార్సన్‌ మాట్లాడుతూ"కేన్‌కు విశ్రాంతిని ఇవ్వడానికి ఇదే సరైన సమయంగా భావించాం. ప్రపంచకప్‌ నుంచి నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్నాడు" అని అన్నాడు.

"క్రికెట్ ఆడటంతో పాటు జట్టు బ్యాటింగ్‌ భారాన్ని పూర్తిగా మోస్తున్నాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో న్యూజిలాండ్ పలు కీలక సిరీస్‌లు ఆడునుంది. దీంతో అతడికి విశ్రాంతినివ్వాలని భావించాం. ఇక వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టును సన్నద్దం చేస్తున్నాం" అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో న్యూజిలాండ్ 0-1తో వెనుకంజలో ఉంది. మూడు టీ20ల సిరీస్‌ కోసం మంగళవారం 14 మంది సభ్యులతో కూడిన కివీస్‌ జట్టును సెలక్టర్లు ప్రకటించారు.

లంకతో టీ20 సిరిస్‌కు న్యూజిలాండ్ జట్టు
టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), ఆస్టల్‌, టామ్‌ బ్రూస్‌, గ్రాండ్‌హోమ్‌, ఫెర్గుసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, స్కాట్‌ కుగ్లెజన్‌, మిచెల్‌, కోలిన్‌ మున్రో, ర్యాన్సే, సాంట్నర్‌, టిమ్‌ సెఫెర్ట్‌, ఇష్‌ సోధి, రాస్‌ టేలర్‌

Story first published: Tuesday, August 20, 2019, 18:18 [IST]
Other articles published on Aug 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+