ధోని వచ్చాడుగా... హోబర్ట్‌కు ఆడతావా?: పంత్‌పై స్లెడ్జింగ్‌కు దిగిన పైన్

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఇరు జట్ల ఆటగాళ్ల కవ్వింపులతో రసవత్తరంగా మారుతోంది. ఆటలో మూడో రోజైన శుక్రవారం టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మళ్లీ స్లెడ్జింగ్‌కి దిగాడు.
ఇదే టెస్టులో రెండోరోజైన గురువారం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్... రోహిత్ శర్మ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. చాలా ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి తెగ ప్రయత్నించాడు.

రోహిత్‌ను టీజ్ చేసిన టిమ్ పైన్
లియాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పైన్ "ఇప్పుడు రోహిత్ శర్మ సిక్స్ కొడితే నేను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి మారిపోతా" అని టిమ్ పైన్ కవ్వించడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. తాజాగా, శుక్రవారం ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని కవ్వించాడు.
రిషబ్ పంత్‌కు సూపర్ డీల్ ఆఫర్ చేసిన పైన్
"ధోనీ మళ్లీ వికెట్ కీపర్‌గా భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చేశాడు. కాబట్టి, నిన్ను బిగ్‌బాష్ టోర్నీలోని హాబర్ట్ హారికేన్స్ టీమ్‌లోకి తీసుకుంటా. ఈ డీల్ ఓకే అయితే బాగుంటుంది కదా? నువ్వు కూడా ఆస్ట్రేలియా హాలిడేస్‌ని మరింతగా ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఓ మంచి అపార్ట్‌మెంట్ తీసుకుందాం. ఒకవేళ నువ్వు అమ్మాయితో గడపాలనుకుంటే.. నేను నా భార్యని తీసుకుని సినిమాకి వెళ్తా. నువ్వు రాత్రంతా అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు" పంత్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

పైన్ మాటలకు బదులివ్వని పంత్
అయితే రిషబ్ పంత్ మాత్రం టిమ్ పైన్ మాటలకు బదులివ్వలేదు. ఆ తర్వాత బంతికే సహనం కోల్పోయి హిట్టింగ్ కోసం ప్రయత్నించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో రిషబ్ పంత్‌పై వేటు వేసిన సెలక్టర్లు మళ్లీ వికెట్ కీపర్‌గా ధోనీని ఎంపిక చేశారు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆధిక్యం 346
మొత్తానికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 27 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి 54 పరుగుల చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. కమ్మిన్స్ నాలుగు, హాజెల్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications