
క్వారంటైన్‌కు సిద్ధంగా లేము
ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బేన్‌లో ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు తెగేసి చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్ పైన్ స్పందించాడు.

అవి జరుగుతాయేమో అనిపిస్తుంది
తాజాగా టిమ్ పైన్ వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'కొన్ని కొన్ని విషయాలు ఉత్కంఠకు దారితీశాయి. దీంతో టెస్టు కొనసాగడం ఉత్కంఠ నెలకొంది. అయితే టీమిండియా సముఖంగా లేదని, నాలుగో టెస్టు ఆడటంపై స్పష్టత రాలేదని, భారత బృందంలో కొందరు పేర్కొన్నట్లు.. తెలియడంతో ఆందోళనకు గురయ్యా. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన టీమిండియా నుంచి అలాంటి విషయాలు విన్నప్పుడు అవి జరుగుతాయేమో అనిపిస్తుంది' అని అన్నాడు.

ముంబైలో ఆడమన్నా ఆడతాం:
'మేం ప్రస్తుతం మూడో టెస్టు గురించే ఆలోచిస్తాం. కరోనా నిబంధనలపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఈ వారం ఆటపైనే దృష్టిసారిస్తాం. వచ్చే వారం గురించి తర్వాత ఆలోచిస్తాం. అదే వేదికపై టెస్ట్ మ్యాచ్ జరగాలని మేం కోరుకోవట్లేదు. ముంబైలో మ్యాచ్ జరిగినా దానికి తగ్గట్లుగా సన్నద్ధమై బరిలోకి దిగుతాం. ఇప్పుడు విమానంలో వెళ్లి.. ముంబైలో మ్యాచ్ ఆడమన్నా ఆడతాం. ఎంతో కాలం తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్నందుకు ఇరు జట్లు సంతోషంగా ఉన్నాయి' అని పైన్ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారా అని అడిగిన ప్రశ్నకు పైన్ సమాధానం దాటవేశాడు. ఆ విషయాన్ని టీమిండియానే అడగాలన్నాడు.

చివరి టెస్టుపై నో క్లారిటీ
స్టారెంట్‌కు వెళ్లినందుకు రోహిత్ శర్మతో సహా నలుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారని ఆస్ట్రేలియా మీడియా కోడై కూసింది. ఇవన్నీ అబద్ధాలని తర్వాత తేలింది. మరోవైపు నిబంధనలు పాటించకపోతే బ్రిస్బేన్‌కు భారత ఆటగాళ్లు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్‌లాండ్ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడంతో టెస్టు సిరీస్‌పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ చివరి టెస్టుపై క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications

వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ!!










