Virat Kohli వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్.. మాట మార్చిన టిమ్ పైన్

Team India Former Cricketer Deep Dasgupta Slams Tim Paine || Oneindia Telugu

మెల్‌బోర్న్‌: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా చీటింగ్ చేసి గెలిచిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్.. అంతలోనే మాట మార్చాడు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పైన్ కొనియాడాడు. అతన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు. తాజాగా అతను 'గిల్లీ అండ్‌ గాస్‌' అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'కోహ్లీ గురించి గతంలో చాలాసార్లు చెప్పాను. అతని లాంటి ఆటగాడిని ఏ కెప్టెన్‌ అయినా తమ జట్టులో ఉండాలని కోరుకుంటారు. అతను గట్టి పోటీనిచ్చే క్రికెటర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ప్రత్యర్థి జట్టుగా కోహ్లీతో ఆడటం సవాలుగా ఉంటుంది. అయితే, తన ఆటతో అవతలి వారికి చికాకు, విసుగు తెప్పిస్తాడు. అతను తన పోటీతత్వంతో మనల్ని కూడా పోటీపడేలా చేస్తాడు. అతనితో నాలుగేళ్ల క్రితం వాగ్వాదం మొదలైంది. నేనెప్పటికీ గుర్తుంచుకునే ఆటగాళ్లలో కచ్చితంగా టీమిండియా కెప్టెన్ ఒకడు' అని పైన్‌ చెప్పుకొచ్చాడు.

అయితే 'భారత జట్టలో విరాట్‌ ఒక ఆటగాడు మాత్రమే. అతని గురించి పెద్దగా ఆందోళన చెందట్లేదు' అని గత ఏడాది భారత్‌తో సిరీస్‌ ముంగిట పైన్‌ వ్యాఖ్యానించడం విశేషం. పైన్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 2018-19లో కోహ్లీసేన చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఓడింది. మళ్లీ గత ఏడాది చివర్లో ఆరంభమైన సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తర్వాత కోహ్లి స్వదేశానికి వచ్చేసినా, సిరీస్‌ మధ్యలో కీలక ఆటగాళ్లు గాయపడినా టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు తమ దృష్టి మళ్లించి సిరీస్‌ గెలిచిందని ఇటీవల పైన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 17, 2021, 10:14 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X