టీమిండియా మా ఏకాగ్రతను పక్కదారి పట్టించి టెస్టు సిరీస్ గెలిచింది.. టిమ్ పైన్ సంచలన వ్యాఖ్యలు!!

సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తమ ఏకాగ్రతను పక్కదారి పట్టించి.. టెస్టు సిరీస్ గెలిచిందన్నాడు. 'సైడ్ షోస్'ను సృష్టించడంలో టీమిండియా చాలా బాగుందని, ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో తమ ఏకాగ్రతను చెదరగొట్టిందన్నాడు. ఆసీస్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ ఆటగాళ్లకు మింగుడుపడడం లేదు.

2-1తో సిరీస్‌ను కైవసం
పెటర్నిటీ లీవ్‌పై బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును ముందుండి నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల అండతో ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. కోహ్లీ లేకున్నా.. సీనియర్ పేసర్లు గాయపడ్డా.. అనుభవం లేని ఆటగాళ్లే బౌలింగ్ చేసినా పైన్ బృందాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, చేటేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడారు.

గబ్బాకు వెళ్లమని చెప్పారు
తాజాగా ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ న్యూస్.కామ్ ద్వారా మాట్లాడాడు. ''పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్‌లో అలాంటి వాటికి మేం వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ కూడా చెబుతా. టీమిండియా ఆటగాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం' అని పైన్ అన్నాడు. కరోనా అధికకంగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ గబ్బాలో కాకూండా వేరే వేదికపై నిర్వహించాలని సూచించింది.

కెప్టెన్సీ ఇవ్వడానికి సిద్దమే:
'స్టీవ్ స్మిత్ ఆసీస్ టెస్ట్ జట్టు పగ్గాలు అందుకోవడానికి అర్హుడే. అయితే నేను ఆ నిర్ణయం తీసుకోలేను కదా. స్టీవ్ కెప్టెన్సీలో నేను ఆడాను. అతడు అద్భుతం. వ్యూహాత్మకంగా వ్యహరిస్తాడు. చాలా చిన్న వయస్సులో చాలా పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నేను జట్టు పగ్గాలు అందుకొనేసరికి మంచి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. ఆపై దక్షిణాఫ్రికాలో ఊహించని సంఘటనలు జరిగాయి. ఏదేమైనా నేను అతనికి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వడానికి మద్దతు ఇస్తాను. కనీసం మరో ఆరు టెస్టులకు నేను ఉంటాను' అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా చేసిన 23 మ్యాచ్‌ల్లో పైన్ 11 విజయాలు అందుకున్నాడు. నాలుగు డ్రాలు, 8 ఓటములను ఎదుర్కొన్నాడు.

కంగారూలను మించిన వారే లేరు:
సాధారణంగా ఆసీస్‌లో పర్యటించే జట్టు ఏకాగ్రతను పక్కదారి పట్టించడంలో కంగారూలను మించిన వారే లేరు. స్లెడ్జింగ్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యాటక జట్లు ఓడిపోవడం ఖాయమేనంటూ మైండ్ గేమ్‌కు తెరతీస్తారు. మాజీలు కూడా సిరీస్ ఆరంభం ముందు ఆసీస్ సిరీస్ గెలుస్తుందని జోస్యాలు చెపుతుంటారు.ఇక అక్కడి స్థానిక మీడియా సైతం అందుకు తగ్గట్టే కథనాలు ప్రచురిస్తుంటాయి. అయితే భారత్ 2-1తో సిరీస్ గెలవడంతో టీమ్ పైన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలా తన నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
వార్నర్‌పై వేటు వేసినపుడు..కోచ్‌లను ఎందుకు తప్పించరు?!అక్కడైతే మొదట తప్పించేది మేనేజర్‌నే!క్రికెట్‌లో ఎందుకిలా