Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత అభిమానులు నాపై వేలెత్తి చూపుతున్నారు.. అయినా ఫర్వాలేదు! నేను వారిని ప్రేమిస్తా'

Tim Paine says Team India fans slamming me on social media, Still I love them

సిడ్నీ: భారత క్రికెట్‌ అభిమానులు తనను విమర్శిస్తున్నారని, అయినా ఫర్వాలేదని ఆసీస్‌ టెస్టు సారథి టిమ్‌ పైన్‌ అన్నాడు. ఉద్దేశ పూర్వకంగా తానేమీ టీమిండియాపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేయలేదన్నాడు. ఆ ముఖాముఖిలో సవాళ్ల గురించి ప్రశ్నించారని తెలిపాడు. అందులో భాగంగా కొన్ని అంశాలు సవాల్‌గా మారాయని వివరించాడు. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకొనే అర్హత భారత జట్టుకు ఉందని పైన్‌ తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆసీస్ పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

మండిపడ్డ ఫాన్స్:

మండిపడ్డ ఫాన్స్:

తాజా పర్యటనలో భారత్ తమను పక్కదారి పట్టించిందని టిమ్‌ పైన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆటేతర అంశాలతో దృష్టి మళ్లించడంతో తాము ఓటమి పాలయ్యామని చెప్పాడు. అందువల్లే తమ ఏకాగ్రత దెబ్బతిందని, బంతిపై దృష్టి సారించలేకపోయామని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై భారత మాజీలతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. పైన్‌ నిందలు వేస్తున్నాడని విమర్శించారు. ఈ విషయాలు తెలుసుకున్న ఆసీస్ కెప్టెన్ తాజాగా స్పందించాడు. 'గిల్లీ అండ్ గాస్' పోడ్కాస్ట్ షో సందర్భంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, టిమ్ గోసేజ్ పలు విషయాలపై మాట్లాడారు. ఇదే షోలో టిమ్‌ పైన్‌ కూడా పాల్గొన్నాడు.

సవాళ్ల గురించి అడిగారు:

సవాళ్ల గురించి అడిగారు:

'ఆ షోలో పాల్గొన్న నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. టీమిండియాతో ఆడినప్పుడు ఎదురైన సవాళ్ల గురించి అడిగారు. అందులో ఒకటి ఏకాగ్రత చెదరగొట్టిన అంశాలు. వారు బ్రిస్బేన్‌కు వెళ్లరన్నది ఒక రూమర్. తరచూ గ్లోవ్స్‌ మార్చడం, ఫిజియోలు రావడంతో ఏకాగ్రత పోయి.. బంతిపై దృష్టి సారించలేకపోయాం. అయితే భారత్ మమ్మల్ని చిత్తుగా ఓడించిందనీ చెప్పాను. విజయానికి వారు అర్హులని చెప్పాను. భారత అభిమానులు సోషల్‌ మీడియాలో నన్ను విమర్శిస్తున్నారు' అని టిమ్‌ పైన్‌ అన్నాడు.

భారత అభిమానుల్ని ప్రేమిస్తా:

భారత అభిమానుల్ని ప్రేమిస్తా:

'భారత అభిమానుల్ని నేను ప్రేమిస్తాను. చాలాసార్లు ప్రశంసించేందుకు నేను ఎప్పుడూ వెనుకాడను. నేను క్యాచులు వదిలేసినప్పుడు వారు చెలరేగారు. అందులో తప్పేం లేదనే అంటాను. అభిమానుల్లోని ప్రేమ, అనురాగాన్ని నేను ప్రేమిస్తాను. వారు సానుకూలంగా విమర్శిస్తే ఫర్వాలేదు. కానీ కొందరు నాపై వేలెత్తి చూపుతున్నారు. అయినా ఫర్వాలేదు. వారంటే నాకిష్టమే' అని ఆసీస్ టెస్ట్ సారథి టిమ్‌ పైన్‌ పేర్కొన్నాడు.

 కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌:

కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై టిమ్‌ పైన్‌ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మరోసారి చెపుతున్నా.. విరాట్ నీ సొంత జట్టులో ఉండటానికి ఇష్టపడే ఆటగాడిగా ఎప్పుడూ కనిపిస్తాడు. అతను పోటీదారుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అతడికి వ్యతిరేకంగా ఆడడం ఎంతో సవాలుగా ఉంటుంది. ఎందుకంటే విరాట్ గొప్ప ఆటగాడు. నాలుగేళ్ల క్రితం అతనితో గొడవ పడ్డాను. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను' అని పైన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 15, 2021, 11:29 [IST]
Other articles published on May 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+