Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ కాంట్రాక్టుల గురించి కాదు.. కోహ్లీతో గొడవ ఎందుకు వద్దనుకున్నామంటే: ఆసీస్ కెప్టెన్

Tim Paine says Players weren’t thinking about IPL contract while bowling to Virat Kohli
Australian Cricketers Weren’t Scared About IPL Contract – Tim Paine

హోబర్ట్‌: ఎంతో విలువైన ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్‌ చేయలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్లార్క్‌ చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టీమ్ పైన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. టీమిండియా-ఆసీస్‌ టూర్‌లో కోహ్లీని రెచ్చగొట్టకూడదనే వ్యూహంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించినట్టు పైన్‌ తెలిపాడు.

మా వ్యూహం అదే:

మా వ్యూహం అదే:

'ఆస్ట్రేలియా జట్టులో ఎవరూ విరాట్ కోహ్లీతో చాలా మంచిగా ఉండడం గానీ, అతణ్ని ఔట్‌ చేయడానికి ప్రయత్నించకుండా ఉండడం గానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరు కోహ్లీ పట్ల సరళంగా ఉన్నారో నాకు తెలియదు. కోహ్లీతో గొడవకు దిగి అతడిని రెచ్చగొట్టకూడదన్నది మా వ్యూహం. ఒకవేళ రెచ్చిగొట్టినప్పుడు అతడు తన అత్యుత్తమ క్రికెట్‌ ఆడతాడన్నది మా ఉద్దేశం. ఇంతకంటే వేరే ఆలోచన మాకు లేదు' అని టెస్టు కెప్టెన్‌ టీమ్ పైన్‌ వివరణ ఇచ్చాడు.

నేను కోల్పోయేదేమీ లేదు:

నేను కోల్పోయేదేమీ లేదు:

'ఐపీఎల్‌ టోర్నీతో నాకైతే పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. నేను కోల్పోయేదేమీ లేదు. కానీ.. ఎప్పుడు ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడినా మా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తారు. విరాట్ కోహ్లీకి బౌలింగ్‌ చేసేటప్పుడు మా బౌలర్లు ఐపీఎల్‌ కాంట్రాక్టుల గురించి ఆలోచిస్తారని నేను అనుకోను. అతని వికెట్ త్వరగా తీయడానికి ప్రయత్నిస్తారు. అందరికి వేసినట్టే బౌలింగ్ చేస్తారు' అని పైన్‌ అన్నాడు.

 స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు:

స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు:

తాజాగా బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసు. ఆసీస్ ఆటగాళ్లే కాదు దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండరు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు' అని క్లార్క్ అన్నాడు.

అక్టోబరులో ఆస్ట్రేలియా టూర్:

అక్టోబరులో ఆస్ట్రేలియా టూర్:

2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో భారత్‌ 2-1తో టెస్ట్‌ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. భారత జట్టు వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సివుంది. ఆ పర్యటనలో భారత్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుతం మహమ్మారి కరోనా కారణంగా టోర్నీలు అన్ని రద్దయ్యాయి. అయితే ఈ టూర్‌కు ఇంకా దాదాపు 6 నెలల సమయం ఉండడంతో టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Friday, April 10, 2020, 9:51 [IST]
Other articles published on Apr 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+