For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్‌ స్మిత్‌ ఉన్నా.. అప్పుడే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా: టిమ్‌ పైన్‌

Tim Paine says If Australia win Ashes 2021, I will giving up captaincy to Steve Smith

సిడ్నీ: ఈ ఏడాది చివరలో ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తాము గెలిస్తే.. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్‌ స్మిత్‌కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్‌ పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. స్మిత్ అద్భుతమైన సారథి అని ప్రశంసించాడు. స్మిత్ చాలా చిన్న వయస్సులో పెద్ద బాధ్యత తీసుకున్నాడన్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని స్మిత్‌ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్మిత్‌తో పాటు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కూడా ఒక ఏడాది నిషేధం పడిన విషయం తెలిసిందే.

స్మిత్‌ కూడా నాలాంటి వాడే:

స్మిత్‌ కూడా నాలాంటి వాడే:

'కెప్టెన్సీ విషయంలో కచ్చితంగా నేనా నిర్ణయం తీసుకోలేను. కానీ స్మిత్‌ సారథ్యంలో నేను ఆడినప్పుడు అతడు అద్భుతమైన సారథిగా ఉన్నాడు. నైపుణ్యం పరంగానూ చాలా మంచి ఆటగాడు. స్మిత్‌ కూడా నాలాంటి వాడే. తస్మానియా జట్టుకు నేను కెప్టెన్‌గా కొనసాగుతున్న తొలి నాళల్లో అతడు జాతీయ జట్టుకు కెప్టెనయ్యాడు. అదీ చాలా చిన్న వయసులో. అప్పుడు దానికి అతడు సిద్ధంగా లేడు. తర్వాత నేను జట్టులోకి వచ్చేసరికి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంతో మెరుగయ్యాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి దూరమయ్యాడు. అయితే తిరిగి అతడు కెప్టెన్సీ పగ్గాలు చేపడితే నేను మద్దతిస్తాను' అని టిమ్‌ పైన్‌ అన్నాడు.

విన్నింగ్‌ షాట్‌ కొట్టాక:

విన్నింగ్‌ షాట్‌ కొట్టాక:

'ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో మేం 5-0 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించాక.. ఇదే సరైన సమయం అని నేను భావించి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఎంత బాగుంటుంది. కానీ అదెంతో కష్టతరమైన సిరీస్‌గా ఉండొచ్చు. ఇరు జట్లలో అగ్రస్థాయి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచులు రసవత్తరంగా సాగొచ్చు. చివరి రోజు మేం 300 పరుగులు ఛేదించాల్సి రావచ్చు. అప్పుడు నేను సెంచరీతో చెలరేగడమే కాకుండా విన్నింగ్‌ షాట్‌ కొట్టాక.. అప్పుడు నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా' అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కెప్టెన్‌గా చేసిన 23 మ్యాచ్‌ల్లో పైన్‌ 11 విజయాలు అందుకున్నాడు. ఒక నాలుగు డ్రాలు, 8 ఓటములను ఎదుర్కొన్నాడు.

 ఏకాగ్రతను చెదరగొట్టి:

ఏకాగ్రతను చెదరగొట్టి:

ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ ఆటగాళ్లకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలో టిమ్‌ పైన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తమ ఏకాగ్రతను పక్కదారి పట్టించి.. టెస్టు సిరీస్ గెలిచిందన్నాడు. 'సైడ్‌ షోస్'ను సృష్టించడంలో టీమిండియా చాలా బాగుందని, ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో తమ ఏకాగ్రతను చెదరగొట్టిందన్నాడు. పెటర్నిటీ లీవ్‌పై బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో‌ని మూడు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును ముందుండి నడిపించాడు. కోహ్లీ లేకున్నా.. సీనియర్‌ పేసర్లు గాయపడ్డా.. అనుభవం లేని ఆటగాళ్లే బౌలింగ్‌ చేసినా పైన్‌ బృందాన్ని భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది.

Story first published: Friday, May 14, 2021, 8:16 [IST]
Other articles published on May 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+