For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పైన్‌.. ఇదేందయ్యో ఇది! అందుకోసమే కాలితో షాట్ ఆడబోయావ్ కదా? (వీడియో)

Tim Paine gets trolled for kicks the ball with foot on Day 4 of Brisbane Test

బ్రిస్బేన్‌: గబ్బా మైదానంలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ ఫన్నీ తరహా షాట్ ఆడడానికి ప్రయతించాడు. టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఇబ్బందిపడుతూ కనిపించిన ‌పైన్‌ (27: 37 బంతుల్లో 3x4) చివరికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 65వ ఓవర్ చివరి బంతికి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో వేగంగా పరుగులు చేద్దామనుకున్న పైన్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఫన్నీ తరహా షాట్ ఆడడంతో పైన్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.

నాలుగో రోజు ఆటలో టీమ్ ‌పైన్‌ పదే పదే ఆఫ్ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లి బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. లెగ్ గల్లీ, షార్ట్ లెగ్‌‌లో ఫీల్డర్లని ఉంచిన వాషింగ్టన్ సుందర్.. బంతిని మిడిల్ స్టంప్‌ లైన్‌ విసిరి టర్న్ చేస్తూ వచ్చాడు. దాంతో షాట్ సెలక్షన్ విషయంలో పైన్‌ కాస్త గందరగోళానికి గురయ్యాడు. డిఫెన్స్‌కి ప్రయత్నిస్తే.. క్యాచ్‌గా వెళ్లే ప్రమాదం ఉన్నందున కొన్ని బంతుల్ని ఆడకుండా వదిలేశాడు. ఇక సుందర్ బంతులను ఎదుర్కోలేక.. ఒకానొక దశలో బంతిని కాలితో తన్నేందుకు ప్రయత్నించాడు. అయితే అది కూడా ఫలించలేదు.

వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో చక్కగా బంతి గమనాన్ని అంచనా వేస్తూ.. కీపర్ రిషబ్ పంత్ వికెట్ల వెనుక చురుగ్గా కదిలాడు. దాంతో.. లెగ్ బైస్ రూపంలో పరుగులు రాబట్టాలనే టీమ్ ‌పైన్‌ ఆశ నెరవేరలేదు. కాలితో తన్నినా.. బంతికి తగల్లేదు. నేరుగా వెళ్లి పంత్ చేతుల్లో పడింది. ఆఖరికి శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పంత్‌కే క్యాచ్ ఇచ్చి పైనీ ఔటయ్యాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 'పైన్‌.. ఇదేందయ్యో ఇది', 'ఈ షాట్ ఎక్కడ చూడలేదే?', 'లెగ్ బైస్ కోసమే కాలితో షాట్ ఆడబోయావ్ కదా?' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నిర్ణయాత్మక చివరి టెస్టుకు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటలో 23 ఓవర్లు తుడిచిపెట్టుకు పోయాయి. తొలి రోజు ఆటలో కూడా వర్షం కారణంగా ఓ సెషన్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా నాలుగో రోజు ఆటలో భారత్‌దే పైచేయి. చారిత్రక విజయానికి టీమిండియా 324 పరుగుల దూరంలో నిలిచింది. ఆట ముగిసేసరికి 1.5 ఓవర్లకు 4/0తో నిలిచింది. తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ (4) బౌండరీ బాది మంచి లయలో ఉన్నట్లు కనిపించాడు. మరో ఓపెనర్ గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. మహ్మద్‌ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్‌ (4/61) ధాటికి ఆసీస్ 294 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

Story first published: Monday, January 18, 2021, 14:20 [IST]
Other articles published on Jan 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+