అనుభవం లేకపోవడమే మా పరాజయానికి కారణం: టిమ్ పైన్

మెల్‌బౌర్న్: ఆస్ట్రేలియా పర్యటనలోని రెండో ఫార్మాట్‌లో భారత్ పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. పెర్త్ పరాజయం అనంతరం విజయకాంక్షతో బరిలోకి దిగి ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో టెస్టులో రాణించిన ఆసీస్ క్రికెటర్లను మూడో టెస్టులో చిత్తుగా ఓడించారు. ఈ పరాజయం పట్ల మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ.. ఇది తమ బ్యాట్స్‌మెన్ అనుభవరాహిత్యమే కారణమని అభిప్రాయపడ్డాడు.

ఓటమి కొంచెం నిరాశను కలిగించి
‘ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది. పెర్త్ విజయాన్ని కొనసాగించాలని కోరుకున్నాను. కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరాహిత్యమే మమ్మల్ని పరాజయం పాలైయ్యేలా చేసింది. ప్రపంచ దిగ్గజ పేస్ అటాక్ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్-6 బ్యాట్స్‌మెన్ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతాం. మా ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారు. సిడ్నీ టెస్ట్ మాకో పెద్ద ఛాలెంజ్‌గా భావిస్తాం. ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించి.. సిరీస్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం.

బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి సమాలోచనలు
జట్టు గురించి విశ్లేషణ చేస్తాం. బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి సమాలోచనలు జరుపుతాం. సిడ్నీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి క్రెడిట్. వారు అద్భుతంగా ఆడారు. ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ అద్భుతం. అతనో నాణ్యమైన ఆటగాడు. ఈ సిరీస్ ఆసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనిలా రాణించే ఆటగాళ్లు కావాలి. ఒక్క విషయంలో తప్ప ఈ ఏడాది బాగానే గడిచింది. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి రాబోతున్నారు. ఇది ఆసీస్ జట్టుకు కలిసొచ్చే అంశం.' అని పైన్ చెప్పుకొచ్చాడు.

137 పరుగుల తేడాతో విజయం
మూడో టెస్ట్‌లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. నిర్ణయాత్మక మ్యాచ్ అయిన చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్ కాపాడుకుంటే సిరీస్ విజేతగా భారత్ నిలవనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications