For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Big Bash League: మొదట్లో ఓపెనర్లు.. చివర్లో టిమ్ డేవిడ్.. ఏం ఆటరా అది?

Tim David seals the win for Hobart Hurricanes

బిగ్ బాష్ లీగ్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ టీం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆరంభంలో ఓపెనర్లు రెచ్చిపోగా.. చివర్లో ఆసీస్ యువ ప్లేయర్ టిమ్ డేవిడ్ తను ఎందుకు స్పెషల్ ప్లేయరో నిరూపించుకున్నాడు. బ్లండ్‌స్టోన్ ఎరీనా వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, హోబర్ట్ హర్రికేన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన స్ట్రైకర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రైకర్స్‌కు ఓపెనర్ మ్యాట్ షార్ట్ (38) మంచి ఆరంభం అందించాడు. అయితే మరో ఓపెనర్ హెన్రీ హంట్ (3) విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉండగా క్రిస్ లిన్ (87) అదరగొట్టాడు. అతనికి ఆడమ్ హోస్ (2) సహకారం అందించలేకపోయాడు. చివర్లో కోలిన్ డి గ్రాండ్‌హోం (30) ధనా ధన్ ఆటతో ఆకట్టుకున్నాడు. రషీద్ ఖాన్ (2) రనౌట్ అవగా థామస్ కెల్లీ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో హర్రికేన్ జట్టుకు అదరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ కాలెబ్ జూవెల్ (28 బంతుల్లో 54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి జోడీగా దిగిన బెన్ మెక్‌డెర్మాట్ (53) కూడా రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. అయితే హరికేన్స్ సారధి మాథ్యూ వేడ్ (9) ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. చివర్లో డీఆర్కీ షార్ట్ (27 నాటౌట్), టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 27 నాటౌట్) కూడా చెలరేగారు.

దీంతో ఆ జట్టు కేవలం 17.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగులు చేసింది. హర్రికేన్ బ్యాటర్లను అవుట్ చేయడానికి స్ట్రైకర్స్ బౌలర్లు ఎంత కష్టపడినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన జూవెల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Monday, January 2, 2023, 17:30 [IST]
Other articles published on Jan 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+