IPL 2022: చివర్లో ముంబై జోరు.. ప్లేయర్లపై కనక వర్షం.. 8 కోట్ల భారీ ధరతో మరో ఆటగాడిని కొనుగోలు

బెంగళూరు: తొలి రోజు మొత్తం, రెండో రోజు ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఎక్కువ మంది ఆటగాళ్లను కొనుగోలు చేయలేదు. కానీ రెండో రోజు వేలంలో చివర్లో మాత్రం ఆ జట్టు వరుసగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. అది కూడా భారీ ధర వెచ్చించి కావడం గమనార్హం. తాజాగా ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో 40 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో మెగా వేలంలోకి వచ్చిన టిమ్ డేవిడ్ పంట పండిందని చెప్పుకోవచ్చు. అతడిని 8 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు ముంబై కొనుగోలు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా 8 కోట్ల రూపాయల భారీ ధరతో కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటికే గాయపడి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఆర్చర్‌పై 8 కోట్ల పెట్టడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా మోచేతి గాయంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు ఆర్చర్ దూరంగా ఉండనున్నాడు. అయితే భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఆర్చర్‌ను ముంబై కొనుగోలు చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఈ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, దేవాల్డ్ బ్రేవిస్, డానియల్ శామ్స్, ఎన్.తిలక్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, సంజయ్ యాదవ్, బాసిల్ తంపిని కొనుగోలు చేసింది. మొత్తంగా వేలంలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందు రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లను కలుపుకుని ముంబై ఇండియన్స్‌లో ప్రస్తుతం 16 మంది ఆటగాళ్లు ఉన్నారు.
ఇక ప్రశాంత్ సోలంకిని చెన్నై సూపర్ కింగ్స్ కోటి 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. చమ మిలింద్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 25 లక్షల రూపాయలకు దక్కించుకుంది. మొహ్సిన్ ఖాన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ ధరకు దక్కించుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రషీఖే ధర్‌ను మెగా వేలంలో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ ధరకు కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications