మిడిల్ ఫింగర్ చూపిన టిమ్ డేవిడ్?
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి రాయ్ పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మట్టికరిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠతగా సాగిన ఈ పోరులో ముంబైని రెండు వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేలా చేసింది ఆర్సీబీ. బ్యాటర్లకు సవాలు విసిరిన పిచ్‌పై కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ మెరుపు బ్యాటింగ్ తో విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఏదీ అచ్చి రాలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు త్వరగా ఔటవడంతో పవర్ ప్లేలోనే తడబడింది. తిలక్ వర్మ (42 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57), నమన్ ధిర్ (32 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 47) సమయోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి కీలక భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి కూడా ప్రారంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి గానీ చివరిబంతికి ఒడ్డెక్కింది. చివరి రెండు ఓవర్లల్లో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 19వ ఓవర్ లో పెద్దగా పరుగులేమీ రాకపోవడంతో చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరం అయ్యాయి. చివరి ఓవర్ నాటకీయంగా మారింది. రసిఖ్ దర్ చివరి బంతికి రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. తొలి పరుగును సులువుగానే పూర్తి చేసినా.. రెండో రన్ కోసం శ్రమించాల్సి వచ్చింది. డైవ్ చేసి మరీ రెండో పరుగు పూర్తి చేయాల్సి వచ్చింది.
అ విజయం తర్వాత ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. మిడిల్ ఫింగర్ ను చూపించినట్లుగా భావిస్తోన్న ఓ వీడియో వైరల్ గా మారింది. ఆర్సీబీ గెలిచిన వెంటనే డగౌట్ నుండి డేవిడ్ మధ్య వేలితో సంజ్ఞ చేస్తూ కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఫుటేజీకి ఎటువంటి అధికారిక ప్రామాణికత లేదు. సంఘటన వెనుక కారణం లేదా సందర్భంపై అధికారిక నిర్ధారణ అంటూ ఏదీ లేదు. ఈ మ్యాచ్ లో అతను గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
హైటెన్షన్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంతో ఆ ఊపులో టిమ్ డేవిడ్ మిడిల్ ఫింగర్ చూపించి ఉండొచ్చని భావిస్తోన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆస్ట్రేలియన్ పవర్ హిటర్ డేవిడ్ గతంలో మూడు సీజన్‌లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. 2025 వేలంలో ఆర్‌సీబీకి మారాడు. గత సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 62.33 సగటు, 185కి పైగా స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications