For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs WI: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టిమ్ డేవిడ్.. తొలి ఆసీస్ ఆటగాడిగా!

AUS vs WI: వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. టెస్ట్ తర్వాత టీ20 సిరీస్‌లో కూడా కంగారూ జట్టు వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. సెయింట్ కిట్స్ లో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ బ్రాండన్ కింగ్ 62 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 9 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. పావెల్(9), రొమారియో షెపర్డ్ చెరో 9 పరుగులతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరో వైపు కెప్టెన్ షాయ్ హోప్ ధాటిగా ఆడి పరుగులు రాబట్టాడు. ఒక దశలో వికెట్లు పడినా.. షాయ్ హోప్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి అద్భుతంగా ఆడాడు.

దీంతో షాయ్ హోప్ 55 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 బౌండరీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీని ద్వారా వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 5 బౌండరీలు కొట్టి 19 బంతుల్లో 22 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 7 బంతుల్లో 20 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 6 బంతుల్లో 15 పరుగులు, కామెరూన్ గ్రీన్ 14 బంతుల్లో 11 పరుగులు చేశారు. ఒక దశలో ఆస్ట్రేలియా జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడపడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి ఆడాడు. వెస్టిండీస్ బౌలింగ్‌ను సిక్సర్లు, బౌండరీలతో చిత్తు చేశాడు. 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు రాకెట్ వేగంతో పెరిగింది. చివరికి 37 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు.

Tim David Creates History Fastest T20 Century by an Aussie Player in AUS vs WI Match

చరిత్ర సృష్టించిన టిమ్ డేవిడ్
ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో టిమ్ డేవిడ్ బ్యాట్ నుంచి 11 సిక్సర్లు, 6 ఫోర్లు వచ్చాయి. ఈ సమయంలో టిమ్ డేవిడ్ స్ట్రైక్ రేట్ 275.68గా ఉంది. దీంతో టిమ్ డేవిడ్ ఇప్పుడు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Saturday, July 26, 2025, 9:40 [IST]
Other articles published on Jul 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+