Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ బౌలర్ 'చకింగ్' వివాదం: అంపైర్‌తో స్టార్ క్రికెటర్ వాగ్వాదం! (వీడియో)

పాకిస్తానీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్ విషయంలో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'ది హండ్రెడ్ 2026' లీగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుది. ప్రత్యక్షప్రసారం అవుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్.. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ వేసిన బంతిని నో-బాల్‌గా ప్రకటించాలని అంపైర్ ను డిమాండ్ చేశాడు. ఈ ఘటన చకింగ్ అనే అంశంపై కొత్త చర్చకు దారితీసింది.

జులై 24, శుక్రవారం నాడు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో జరిగిన ఓమ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తనదైన స్టాప్-అండ్-పాజ్ సైడ్-ఆర్మ్ యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ట్రెంట్ రాకెట్స్ బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉస్మాన్ తారిఖ్ ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా కొంచెం ఫుల్లర్‌గా వేసిన బంతిని డేవిడ్ ఎడ్జ్ చేయగా.. వికెట్ కీపర్ సులభమైన క్యాచ్ అందుకున్నాడు.

Tim David Arguments with Umpire Over Pakistan Spinner Usman Tariq Bowling Action in The Hundred 2026

అంపైర్ వేలు పైకెత్తి క్యాచ్ అప్పీల్‌పై టిమ్ డేవిడ్‌ను ఔట్ అని ప్రకటించాడు, కానీ టిమ్ డేవిడ్ ఆ నిర్ణయంతో ఏకీభవించలేదు. అతను వెంటనే అంపైర్ వైపు వేలు చూపిస్తూ, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై తనకు అభ్యంతరం ఉందని.. అందుకే ఆ బంతి నో-బాల్ అని వాదించాడు. డేవిడ్ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కూడా ప్రయత్నించాడు. కానీ నిబంధనల ప్రకారం అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. చివరికి పెవిలియన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
మేరీలెబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) లా 21.2 ప్రకారం.. బౌలర్ బంతిని విసరకూడదు. బంతిని వేసే సమయంలో బౌలర్ చేయి భుజం ఎత్తుకు వచ్చినప్పటి నుంచి బంతిని విడుదల చేసే వరకు మోచేతిని నిటారుగా ఉంచకూడదు. అయితే మణికట్టును వంచడం లేదా తిప్పడం అనుమతించబడింది. స్ట్రైకర్ ఎండ్‌లోని అంపైర్ లేదా బౌలర్ ఎండ్‌లోని అంపైర్ బంతిని విసిరినట్లుగా భావిస్తే, వారు దానిని నో-బాల్‌గా ప్రకటించవచ్చని కూడా నియమాలు నిర్దేశిస్తున్నాయి.

గతంలోనూ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు
ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్యాటర్ టిమ్ డేవిడ్ ఒక్కడే కాదు. గత సంవత్సర కాలంలో పలువురు స్టార్ ఆటగాళ్లు స్టేడియంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. జనవరి 2026లో లాహోర్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ఉస్మాన్ తారిఖ్ అవుట్ చేశాడు. పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్నప్పుడు, గ్రీన్ బంతిని విసిరేస్తున్నట్లు సైగ చేశాడు. ఈ చర్యను ఉస్మాన్‌పై 'చకింగ్' ఆరోపణగా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గతంలో 2025 డిసెంబర్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ లీగ్ టీ20 మ్యాచ్ సందర్భంగా, ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ కూడా ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌ను ప్రశ్నించాడు. ఔటైన తర్వాత టామ్ బాంటన్ అంపైర్ వద్దకు వెళ్లి, బౌలర్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధతపై సందేహం వ్యక్తం చేస్తూ అతని చేతిని చూపించాడు. అదే సంవత్సరం ప్రారంభంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ కూడా ఉస్మాన్ తారిఖ్‌తో వాగ్వాదం చేస్తూ కనిపించాడు.

Story first published: Sunday, July 26, 2026, 13:07 [IST]
Other articles published on Jul 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+