Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను ఔట్‌ చేసినందుకు చంపుతామన్నారు: స్టార్ పేసర్

Tim Bresnan got death threats after denying Sachin Tendulkar his 100th ton

లండన్: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఒకప్పటి ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ తెలిపాడు. తనతో పాటు తప్పుడు ఎల్బీ నిర్ణయం ఇచ్చిన ఆస్ట్రేలియా అంపైర్‌ రాడ్ టకర్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ 99 సెంచరీలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని బ్రెస్నన్‌ చెప్పుకొచ్చాడు. బ్రెస్నన్‌ ఇంగ్లండ్ తరపున 23 టెస్టులు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.

బ్రెస్నన్‌ అప్పీల్‌

బ్రెస్నన్‌ అప్పీల్‌

2011 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో లిటిల్ మాస్టర్ శతకాల సంఖ్య 99కి చేరింది. తర్వాత ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ 91 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పేసర్ టిమ్‌ బ్రెస్నన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే నిజానికి బంతి లెగ్‌స్టంప్‌ను దాటివెళ్తున్నట్లు రిప్లేలో తేలింది. అప్పటికే బ్రెస్నన్‌ అప్పీల్‌ చేయడం, అంపైర్‌ ఔట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ సంఘటన తర్వాత కొన్నాళ్లకు తనకు బెదిరింపులు వచ్చాయని బ్రెస్నెన్‌ తాజాగా ఓ షో ద్వారా తెలిపాడు.

91 పరుగుల వద్ద ఔట్

91 పరుగుల వద్ద ఔట్

ఆదివారం యార్క్‌షైర్ క్రికెట్ నిర్వహించిన 'కవర్స్ ఆఫ్ పోడ్‌కాస్ట్' షోలో ఇంగ్లండ్ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్ మాట్లాడుతూ... 'ఆ మ్యాచ్‌లో సచిన్‌ 91 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నేను వేసిన బంతి అతని ప్యాడ్‌కు తాకింది. అప్పీలు చేయగానే.. అంపైర్‌ టకర్‌ ఔటిచ్చాడు. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే.. ఇంగ్లండ్‌ గడ్డపైనే సచిన్‌ వంద శతకాలు పూర్తి చేసుకునేవాడు. ఆ రోజు అలా జరిగిపోయింది. ఆ తర్వాత సిరీస్‌ చేజిక్కించుకున్న మా జట్టు ప్రపంచ నంబర్‌వన్‌ స్థానానికి చేరింది' అని అన్నాడు.

చంపేస్తామనే హెచ్చరికలు వచ్చాయి

చంపేస్తామనే హెచ్చరికలు వచ్చాయి

'ఆ సిరీస్ తర్వాత నాతో పాటు అంపైర్‌కు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామనే హెచ్చరికలు కూడా వచ్చాయి. ఔటివ్వడానికి ఎంత ధైర్యం. బంతి లెగ్‌స్టంప్‌ను మిస్‌ అవుతుందని స్పష్టమౌతున్నా అలా ఎలా ఔటిస్తారు అని చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ట్విట్టర్‌లో ఎదుర్కొన్నా. కొందరు అయితే మా ఇంటి అడ్రెస్ కూడా పోస్ట్ చేసి బెదిరించారు. చాలా బయమేసింది. ఈ ఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత నేను అంపైర్ టకర్‌ను కలిశాను. ఈ అంశంపై మాట్లాడగా... "ఆ రోజు నుంచి నేను సెక్యూరిటీ గార్డును నియమించుకున్నా. పోలీసు భద్రత కూడా తీసుకుంటున్నా" అని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయా' అని బ్రెస్నెన్‌ వివరించాడు.

బంగ్లాదేశ్‌పై సెంచరీ:

బంగ్లాదేశ్‌పై సెంచరీ:

ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం 2012 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో.. సచిన్ వంద శతకాలను పూర్తి చేసుకున్నాడు. ఆపై 2013లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో శతకానికి ముందు సచిన్‌ను ఔట్‌ చేసినా.. అంపైర్‌ భయపడి వేలెత్తలేకపోయాడని ఇటీవల దక్షిణాఫ్రికా పేసర్‌ డెల్‌ స్టెయిన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అంపైర్‌ తప్పుడు నిర్ణయం ప్రకటించాడని తెలిసినా.. సచిన్‌ మాత్రం క్రీడా స్పూర్తితో మైదానాన్ని వీడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Story first published: Monday, June 8, 2020, 9:56 [IST]
Other articles published on Jun 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+