తిలక్ వర్మ సెంచరీ.. రాహుల్ డబుల్ సెంచరీ.. టాప్‌లో హైదరాబాద్
దేశవాళీ అత్యున్నత క్రికెట్ టోర్నీ అయిన రంజీట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్ తొలిరోజు ఆటలో హైదరాబాద్ పైచేయి సాధించింది. వైస్ కెప్టెన్ రాహుల్ సింగ్ (214; 157 బంతుల్లో) మెరుపు ద్విశతకం బాదాడు. 23 ఫోర్లు, 9 సిక్సర్లు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (100; 112 బంతుల్లో) కూడా సెంచరీతో కదం తొక్కాడు. తిలక్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు.
ఇన్నింగ్స్ ఆరంభించిన వెంటనే హైదరాబాద్‌కు షాక్ ఎదురైంది. ఓపెనర్ రోహిత్ రాయుడు (2) ఆదిలోనే ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ సింగ్.. తన్మయ్ అగర్వాల్ (80; 109 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, సెంచరీకి చేరవవుతున్న తన్మయ్‌ను జొనాథన్ బోల్తా కొట్టించాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మతో కలిసి రాహుల్ చెలరేగాడు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో రాహుల్ డబుల్ సెంచరీ సాధించుకున్నాడు. కానీ కాసేపటికే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను తిలక్ అందుకున్నాడు. 112 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తిలక్ శతకం అందుకున్న వెంటనే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 474/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి 35 పరుగులకు వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మొజుయ్‌ను త్యాగరాజన్ డకౌట్ చేశాడు. క్రీజులో ఒజుకుమ్ (26), రుపెరో (7) ఉన్నారు. గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన హైదరాబాద్ ఈసారి ప్లేట్ గ్రూపులో ఆడనుంది. ప్లేట్ డివిజన్‌లో నాగాలాండ్, హైదరాబాద్, మేఘలయా, సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ఎలీట్ గ్రూపులో 32, ప్లేట్ డివిజన్‌లో 6 జట్లు ఆడనున్నాయి. కాగా, ఆంధ్ర ఎలైట్ గ్రూపు-బిలో ఉంది. గ్రూపు-బిలో ఉన్న టీమ్స్.. ఆంధ్ర, అస్సాం, బెంగాల్, బిహార్, చత్తీస్‌గఢ్, కేరళ, ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications