Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. ముంబై సారథిగా శ్రేయస్- జట్లు ప్రకటన

దేశవాళీ పొట్టి ఫార్మాట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి వేళైంది. రాజ్‌కోట్‌లో నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరగనుంది. ఈ టోర్నీకి హైదరాబాద్ తమ జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీలతో రికార్డులు బ్రేక్‌ చేసిన తిలక్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు.

టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వరుస శతకాలతో హోరెత్తించాడు. టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత రెండో ప్లేయర్‌గా, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల తర్వాత జట్టును సెలక్షన్ కమిటీ సమీక్షించనుంది. 15 మందితో పాటు మరో ఏడుగురు ఆటగాళ్లను స్టాండ్‌‌‌‌‌‌‌‌బైగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నెల 23న ‌‌‌మేఘాలయతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

Tilak Varma to lead Hyderabad in Syed Mushtaq Ali Trophy

హైదరాబాద్ జట్టు‌‌‌‌‌‌: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, టి. రవితేజ, బుద్ధి రాహుల్, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రాహుల్ రాదేశ్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), శరణు నిశాంత్, రక్షణ్‌ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, అమన్ రావు.

మరోవైపు ముంబై కూడా తమ జట్టును వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 17 మందితో కూడిన జట్టు ముంబై క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. పృథ్వీ షా తిరిగి ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానె వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోనే ఉన్నారు. మరోవైపు రంజీ ట్రోఫీ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి.. బెంగాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్య రహానే, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్ (కీపర్), ఆకాశ్ ఆనంద్ (కీపర్), షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, రాయిస్టన్ డయాస్, జునేద్ ఖాన్.

Story first published: Tuesday, November 19, 2024, 8:12 [IST]
Other articles published on Nov 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+