ముంబై కెప్టెన్‌గా తెలుగోడు?
ముంబై ఇండియన్ యువ కెరటం తిలక్ వర్మ అహ్మదాబాద్‌లో సృష్టించిన విధ్వంస ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో సంచలనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపై కేవలం 45 బంతుల్లోనే అజేయ సెంచరీ(101*) బాదిన తిలక్.. ముంబైకి భారీ విజయాన్ని అందించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన ఓ జోస్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో తిలక్ వర్మ ముంబై కెప్టెన్ అవుతాడా? అనే చర్చకు ఇది ఊపిరిపోస్తోంది.
తిలక్ వర్మ విధ్వంసం.. గుజరాత్ బలి!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. కగిసో రబాడ ధాటికి టాపార్డర్ కుప్పకూలి 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. మొదట ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత గేర్ మార్చి గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి 199 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ కేవలం 100 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై 99 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తిలక వర్మ ఒక్కడే 101 పరుగులు చేస్తే.. గుజరాత్ జట్టు మొత్తం కలిసి 100 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆకాష్ చోప్రా సంచలన జోస్యం
ఈ అద్భుత ప్రదర్శన తర్వాత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా 'ఎక్స్' ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. "తిలక్ వర్మ త్వరలోనే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి కెప్టెన్ కాబోతున్నాడు.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు" అని పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "తిలక్ వర్మ ఒక్కడే గుజరాత్ టైటాన్స్‌ను ఓడించాడు. కేవలం ఒక్క ఇన్నింగ్స్ చూసి కెప్టెన్సీ గురించి ఎలా చెబుతారని మీరు అనుకోవచ్చు. కానీ రెండేళ్లలో, బహుశా అంతకంటే ముందే తిలక్ ఐపీఎల్ టీమ్‌ను నడిపిస్తాడని నా నమ్మకం" అని ఆకాష్ చోప్రా విశ్లేషించారు.
కెప్టెన్సీ రేసులో తిలక్ ముందున్నాడా?
తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు కొత్తేమీ కాదు. ఇప్పటికే టీమిండియా 'ఏ' జట్టుకు, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్ మీద భారత్‌కు నాయకత్వం వహించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు, దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం తిలక్ వర్మకు ఉంది. మైదానంలో తిలక్ ప్రశాంతత, ఒత్తిడిలో రాణించే తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్‌కు అతనే వారసుడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications