పాండ్యా పిచ్చ క్లాస్.. తెలుగోడు ఊర మాస్! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఊహించని రీతిలో ఫామ్‌లోకి వచ్చాడు. అంతకముందు జరిగిన 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20,0, 14, 1, 8 వంటి స్వల్ప స్కోర్లకే పరిమితమైన తిలక్ వర్మ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలవడం విశేషం. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
పాండ్యా క్లాస్.. మారిన ఆటతీరు
ఈ ఇన్నింగ్స్‌లో విశేషమేమిటంటే.. తిలక్ వర్మ మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. 14వ ఓవర్ ముగిసే సమయానికి కూడా తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైదానంలో తిలక్ వర్మ దగ్గరకు వచ్చి చాలా సీరియస్‌గా ఏదో చెప్పాడు. హార్దిక్ పాండ్యా మాటలు తిలక్ వర్మలో సెగలు పుట్టించాయో ఏమో కానీ.. ఆ తర్వాత మాత్రం విధ్వంసం జరిగిపోయింది.

23 బంతుల్లో 82 పరుగులు.. తెలుగోడి విధ్వంసం
హార్దిక్ పాండ్యా మాటల తర్వాత 15వ ఓవర్ నుంచి తిలక్ వర్మ అసలు రూపం బయటకు వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్స్, రెండు ఫోర్లతో బాదడం మొదలుపెట్టిన తిలక్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తర్వాత కేవలం 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి రెండు ఓవర్లోలనే 41 పరుగులు రావడం తిలక్ బ్యాటింగ్ పవర్‌కు నిదర్శనం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోవైపు నుంచి తిలక్ వర్మను ప్రోత్సహిస్తూ అండగా నిలిచాడు.
రికార్డుల వేట.. ముంబై చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ శతకంతో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 45 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసి.. 2008లో సనత్ జనసూర్య నెలకొల్పిన 'ఫాస్టెస్ట్ సెంచరీ' రికార్డును సమం చేశాడు.
ముంబై తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
*45 బంతులు: సనత్ జయసూర్య (2008)
*45 బంతులు: తిలక్ వర్మ (2026)
*47 బంతులు: కెమెరూన్ గ్రీన్ (2023)
*49 బంతులు: సూర్యకుమార్ యాదవ్ (2023)
రబాడ నిప్పులు.. తిలక్ పోరాటం
అంతకు ముందు గుజరాత్ స్టార్ పేసర్ కగిసో రబాడ(3/౩౩) తన పదునైన బౌలింగ్‌తో ముంబై టాపార్డర్‌ను దెబ్బతీశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను 152 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకానొక దశలో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని భావించిన వేళ.. తిలక్ వర్మ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకోవడమే కాకుండా ముంబై ఇండియన్స్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications