Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైస్ కెప్టెన్ బాధ్యత ఉంది.. పిచ్చిగా ఆడలేను: స్ట్రైక్ రేట్ వివాదంపై తెలుగోడు ఫైర్!

టీమిండియా యువ క్రికెటర్, టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇటీవల తన స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించాడు. జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన తిలక్ వర్మ.. తన బ్యాటింగ్ స్టైల్, జట్టులో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో ఆరంభంలోనే వికెట్లు పడటం వల్ల తనలాంటి మిడిలార్డర్ బ్యాటర్ల ఆరంభం నుంచే పూర్తి శక్తితో ఆడేందుకు వీలు కాలేదని భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మంగళవారం పేర్కొన్నాడు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చే బ్యాటర్లు తొలి బంతి నుంచే భారీ షాట్లకు ప్రయత్నించడం తెలివైన పని కాదని అభిప్రాయపడ్డాడు. తన ఆట పరిస్థితులు, మ్యాచ్ సందర్భంపై ఆధారపడి ఉంటుందని తిలక్ స్పష్టం చేశాడు.

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

స్ట్రైక్ రేట్ గురించి తిలక్ వర్మ ఏమన్నాడంటే?
గురువారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో ఈ ఫార్మాట్లో విజయాలు సాధించకపోవడంపై తిలక్ వర్మను ప్రశ్నించారు. టీ20 ఫార్మాట్లో రకరకాల స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని.. పరిస్థితులకు తగినట్లుగా మారడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నాడు. జట్టుకు అవసరమైతే నెమ్మదిగా ఆడి పరుగులు జోడిస్తానని.. హిట్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆడతానని తిలక్ వర్మ వెల్లడించాడు. ఇటీవల సౌతాంప్టన్‌లో జరిగిన టీ20లో కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసిన తన సత్తా ఏంటో నిరూపించుకున్న విషయాన్ని కూడా తిలక్ వర్మ ప్రస్తావించాడు.

Tilak Varma Slams Critics Over T20 Strike Rates Says Responsibility Comes First as Vice Captain

వైస్ కెప్టెన్సీ అనేది బాధ్యత
దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఎంతో బాధ్యత ఉంటుందని వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో దూకుడుగా ఆడాలనుకుంటున్నప్పటికీ.. కొన్నిసార్లు తాను వివేకంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. తాను క్రీజులోకి వచ్చి తొలి బంతిని కొట్టగలనని ఎప్పడూ మనసులో అనుకుంటానని.. కానీ అదే సమయంలో సమయంలో బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన పేరుకు వైస్ కెప్టెన్ అనే బాధ్యత ఇవ్వడం వెనుక జట్టు యాజమాన్యం ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుందని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తాను కష్టపడుతున్నట్లు తిలక్ వర్మ పేర్కొన్నాడు. వ్యక్తిగత రికార్డులు లేదా విమర్శకుల మాటల కంటే యాజమాన్యం అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే తనకు ప్రాధాన్యత అంటూ తిలక్ వివరించాడు.

ఆ వికెట్ టేకర్‌‌ను ఎందుకు ఆడించడం లేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఆ వికెట్ టేకర్‌‌ను ఎందుకు ఆడించడం లేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

తిలక్ వర్మ శ్రేయస్ అయ్యర్ గురించి ఏం చెప్పాడంటే?
ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో ఎదురైన ఓటముల గురించి తిలక్ వర్మ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తమ క్రికెట్‌లో అధికభాగం ఆసియాలోనే ఆడటం వల్ల అక్కడి పరిస్థితులకు జట్టు అలవాటు పడలేకపోవడమే పేలవ ప్రదర్శనకు కారణమని అన్నాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయామని తెలిపాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని ప్రశంసిస్తూ.. ఆయన ఓ విజయవమంతమైన జట్టును నడిపిస్తున్నాడని.. సహజంగానే జట్టుపై, అంచనాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ముగించాడు.

Story first published: Wednesday, July 22, 2026, 8:58 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+