Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరంగేట్రానికి సిద్ధమైన ఫ్రెండ్.. సంతోషం పట్టలేకపోయిన తిలక్!

మరికొన్ని రోజుల్లో జరిగే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసు జరగనుంది. ఈ సిరీసులో సఫారీ కుర్రాడు, 'బేబీ ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్‌కు కూడా చోటు దక్కింది. ఇటీవల సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో బ్రెవిస్ పేరు కూడా ఉంది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ప్లేయర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా తన తోటి ప్లేయర్‌కు కంగ్రాట్స్ చెప్పాడు. తనతో కలిసి ఆడిన బ్రెవిస్ కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నందుకు తిలక్ తెగ సంతోషించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో సిరీసులో తిలక్ వర్మ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Tilak Varma Dewald Brevis

అరంగేట్రం సిరీసులో తిలక్ అద్భుతంగా ఆడాడు. ఐదు టీ20ల సిరీసులో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడీ కుర్రాడు. ఇప్పుడు డెవాల్డ్ బ్రెవిస్ వంతు వచ్చింది. అతను కూడా సౌతాఫ్రికా తరఫున ఇదే మాదిరి రాణించాలని ఎంఐ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు.

'అంర్జాతీయ పిలుపు అందుకున్న నీకు కంగ్రాట్స్ బ్రదర్. చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూస్తుంటే గర్వంగా కూడా ఉంది' అని తిలక్ పోస్టు పెట్టాడు. అంతేకాదు, బ్రెవిస్‌కు వీడియో కాల్ కూడా చేశాడు. ఈ వీడియో కాల్‌లో బ్రెవిస్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తిలక్ నెట్టింట పంచుకున్నాడు.

ఇటీవలే తిలక్ గురించి బ్రెవిస్ కూడా మాట్లాడాడు. తిలక్ ఎప్పుడూ కూడా ఈ మ్యాచ్ తనే గెలిపిస్తాననే మూడ్‌తో ఆడతాడని, అది తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పాడు. ఒక విధంగా తన ఆటపై తిలక్ ప్రభావం కూడా చాలా ఉందని వెల్లడించాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఫ్యాన్స్‌కు కూడా సంతోషం పంచుతోంది.

Story first published: Tuesday, August 15, 2023, 14:21 [IST]
Other articles published on Aug 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+