తిలక్ వర్మ - హీరోయిన్ శ్రీలీల డేటింగ్: తేల్చేసిన తల్లి..!
హీరోయిన్ శ్రీలీల క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత పూర్తిగా ఖండించారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. వారిద్దరూ ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలను ఆమె కొట్టిపారేశారు.
ఒకదానికొకటి సంబంధం లేని కొన్ని విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా చూపించడం వల్లే ఈ పుకార్లు పుట్టాయని స్వర్ణలత చెప్పారు. గత ఏడాది వైకుంఠ ఏకాదశికి శ్రీలీల తన తల్లితో తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో అక్కడికి రావడంతో తప్పుగా అర్థం చేసుకుని వ్యక్తిగత సంబంధాలు ముడిపెడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

అలాగే వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌కు శ్రీలీల హాజరైనప్పుడు ఆమె టీమ్‌లోని ఒక వ్యక్తి తిలక్ వర్మ జెర్సీ (టీషర్ట్) వేసుకున్నారు. అది కూడా అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదు అని ఆమె చెప్పారు.ఇలాంటి సంబంధం లేని విషయాలను ముడిపెడుతూ సోషల్ మీడియాలో కథనాలు సృష్టించడం అన్యాయమని ఆమె అన్నారు.

మరోవైపు హైదరాబాద్ తరపున దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న తిలక్ వర్మ గానీ, హీరోయిన్ శ్రీలీల గానీ ఈ వదంతులపై నేరుగా స్పందించలేదు. శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో పాటు జూన్‌లో జరగబోయే నీట్-పీజీ (NEET-PG) పరీక్షలకు సిద్ధమవుతోందని తల్లి తెలిపింది. ప్రస్తుతం ఆమె దృష్టి పూర్తిగా చదువు, కెరీర్‌పైనే ఉందని పెళ్లి లేదా ప్రేమ వంటి విషయాలకు ఇంకా ఐదారు ఏళ్ల సమయం ఉందని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications