For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 10 ఫైనల్: నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం, కనీవినీ ఎరుగని రీతిలో భద్రత

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ తుది పోరుకు కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

By Nageshwara Rao

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ తుది పోరుకు కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఉప్పల్ స్టేడియం చుట్టూ, లోపల పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి రాచకొండ పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌లతో స్టేడియం లోపల, బయట అణువణువూ చెక్ చేశారు.

ఇక స్టేడియం బయట కూడా అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లతో పోలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తుండటంతో 1,800 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tight security for IPL final

870 మంది లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్‌ సిబ్బంది, 88 సీసీ కెమెరాలతో బందోబస్తు నిర్వహించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంలు, యాంటీ ఈవ్ టీజింగ్ టీంలను ఏర్పాటు చేశారు. సిగరెట్స్, లైట్స్, బయట తిను బండారాలు, వాటర్ బాటిల్స్‌‌కు అనుమతి లేదు.

చిన్న పిల్లల భద్రతకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ గురువారం వెల్లడించారు. స్టేడియం లోపల తినుబండారాలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని, రేట్ల పర్యవేక్షణకు సూపర్ వైజింగ్ ఉంటోందని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి లోపలకి వస్తే మ్యాచ్ ముగిసే వరకూ బయటకు వెళ్ళలేరని వీక్షకులకు చెప్పామని అన్నారు.

కాగా ఇదివరకు ఇలా లేదు.. మనకు ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు.. బయటికి రావచ్చు కానీ ఇప్పుడు రూల్ మారిందని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌‌కు వాహనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాలు సూచించిన స్థలాల్లోనే పార్క్ చేయాలని తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+