
56 సీసీ కెమెరాలు:
దీంతోపాటు స్టేడియం లోపల, బయట, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో 56 సీసీ కెమెరాలను అమర్చామని తెలిపారు. టెస్టు మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే మహిళలు, అమ్మాయిలను వేధించే ఆకతాయిల పనిపట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను రంగంలోకి దించామని చెప్పారు.

సెల్‌ఫోన్లకు అనుమతి:
స్టేడియంలోకి క్రికెట్ అభిమానులు ఎలాంటి వస్తువులను వెంట తీసుకురావద్దని పోలీసులు సూచించారు. బ్యాగులు, బ్యానర్లు, కెమెరాలు, బైనాక్యులర్స్, అగ్గిపెట్టెలు, లైటర్స్, హెల్మెట్స్, సిగరెట్స్, ఇతర తినుబండారాలు, నీళ్ల బాటిళ్లు లోనికి అనుమతించమని తెలిపారు. సెల్‌ఫోన్లను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపారు.

భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ:
మ్యాచ్ జరిగే 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎల్‌బీ నగర్, వరంగల్ నుంచి వచ్చే ఎలాంటి భారీ వాహనాలను హబ్సిగూడ వైపు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్, వరంగల్ దారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఉప్పల్ క్రాస్ రోడ్డు దగ్గర దారి మళ్లీంచారు. ఈ అంక్షలు 9నుంచి 13 వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.

పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా:
* మ్యాచ్ కోసం వచ్చే క్రికెట్ అభిమానులు వారి వాహనాలను జెన్‌ప్యాక్ నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్డు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి రామంతాపూర్ విశాల్ మార్ట్ మార్గంలోని రోడ్లపై వాహనాలను నిలపరాదని అన్నారు.
*G-2, 2A, G-3, G-11 టిక్కెట్‌లు ఉన్న ప్రేక్ష కులు రామాంతపూర్ రోడ్డు నుంచి ప్రవేశించి హెచ్‌పీ పెట్రోల్ బంక్ నుంచి కేవీ-1 మార్గంలో సింగిల్ లైన్‌లో వాహనాలను పార్క్ చేసుకోవాలి.
*దివ్యాంగులైన ప్రేక్షకులకు రామంతాపూర్ రోడ్డు లోని గేటు నెం. 3 నుంచి స్టేడియంలోకి ప్రవేశించాలి. వీరు తమ వాహనాలను పార్కింగ్ ప్లేస్-Bలో పార్క్ చేయాలి.
*G4 నుంచి G10కు సంబంధించిన పాసులు ఉన్నవారు హాబ్సిగూడ, ఉప్పల్ మెయిన్ రోడ్డు వయా ఏక్‌మినార్ నుంచి స్టేడియంలోకి రావాలి. వీరంతా తమ వాహనాలను పెంగ్విన్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి.
*కాంప్లిమెంటరీ పాసులు ఉన్న ప్రేక్షకులు రామంతాపూర్ ఎల్జీ గోడౌన్ వైపు నుంచి G-1 స్టేడియంలోకి ప్రవేశించాలి. వీరు తమ వాహనాలను పార్కింగ్ A లేదా B ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి.

స్కూలు విద్యార్ధులకు ఉచిత ప్రవేశం:
బీసీసీఐ ఆదేశాల మేరకు భారత్, బంగ్లాదేశ్ టెస్టులో ప్రతి రోజు 5000 మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి జాన్ మనోజ్ తెలిపారు. ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఎస్కాట్‌గా ఉంచాలని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ముందుగా పేర్లను నమోదు చేసుకున్నవారికే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే 4 వేల టికెట్లు అమ్ముడుపోయాయని మరో 5 వేల టికెట్లు స్కూల్ పిల్లలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











