For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారీ భద్రతలతో సిద్ధమవుతోన్న చెపాక్ స్టేడియం

Tight security at Chepauk as India play Windies Sunday

చెన్నై: నగరంలోని చెపాక్‌లోని ఎంఏ చిదంబరం మైదానంలో భారత్‌- వెస్టిండీస్‌ల మధ్య టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో భారత్‌ విజయం సాధించింది. దీంతో నేడు జరిగే మూడో మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది. వారం నుంచి టిక్కెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు బారులుదీరారు. వాటిని సొంతం చేసుకుని మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి

ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి

ఇటీవల కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు కోసం రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. అదే సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య టీ20 ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ సందర్భంగా అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లు పుణె వేదికగా నిర్వహించారు. ఈ అనుభవాలతో ప్రస్తుత మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో పోలీసులను స్టేడియం వద్ద మోహరించారు.

మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా క్రికెట్‌ అభిమానులు

మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా క్రికెట్‌ అభిమానులు

వాలాజా, మెరీనా, ట్రిప్లిక్లేన్‌, రాయపేట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసిన హోటల్‌ వద్ద కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కమాండో దళాలు, ప్రత్యేక నిఘా బృందాలు కూడా క్షుణ్నంగా పరిసరాలను పరిశీలిస్తున్నాయి. 2012 తర్వాత నగరంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగలేదు. దీంతో క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కరీబియన్ల పరువును కాపాడుకోవాలని:

కరీబియన్ల పరువును కాపాడుకోవాలని:

చివరి అంకానికి చేరుకున్న భారత్ పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తున్న వెస్టిండీస్‌కు ఆఖరి అవకాశం. ఇప్పటివరకు ఆడిన రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు, రెండు టీ20ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న కరీబియన్లు పరువును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్‌తో జరిగే ఆఖరిదైన మూడో టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

ధోనీ లేకపోవడంతో చెన్నై నిరాశలో

ధోనీ లేకపోవడంతో చెన్నై నిరాశలో

మరోవైపు ఇప్పటికే 2-0తో సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా ఇందులోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికితోడు ఈనెల 21 నుంచి మొదలయ్యే ఆసీస్ పర్యటనకు ముందు ఇది బాగా ఉత్సాహానిస్తుందని భావిస్తోంది. విశ్రాంతి పేరిట కీలకమైన బౌలర్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినా.. రోహిత్‌సేననే ఫేవరెట్‌గా కనిపిస్తుంది. కాగా, తమ ఫేవరెట్ ధోనీ లేకపోవడంతో చెన్నై అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాహుల్, మనీష్, రిషబ్, దినేశ్, క్రునాల్, చాహల్, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్.

వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), హోప్, పూరన్, హెట్మెయర్, బ్రావో, పొలార్డ్, పావెల్, పాల్, అలెన్, పియరీ, థామస్.

Story first published: Sunday, November 11, 2018, 11:28 [IST]
Other articles published on Nov 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+