'భారత్‌తో టై అయినా.. గెలవడంతో సమానం'


న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా అఫ్గనిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌కు వూహించని ఫలితం దక్కింది. అసలే సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ను కూడా సునాయాసంగా గెలిచేస్తుందని తలచారు. ఈ క్రమంలోనే జట్టులో మార్పులు చేశారు. ధోనీకి మళ్లీ కెప్టెన్సీ అప్పజెప్పారు. 200వ వన్డేకు కెప్టెన్‌గా ధోనీ పగ్గాలు చేపట్టిన టీమిండియా పసికూన అఫ్గాన్‌తో తలపడి ఓడిపోకుండా పరువు కాపాడుకుంది.

అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసి
విజయం సొంతమవుతుందనుకున్న దశలో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. అఫ్గాన్ విధించిన 253 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. స్కోర్లు సమం కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. భారత్ లాంటి జట్టుతో మ్యాచ్ టై అయినా అది విజయంతో సమానేమనని అఫ్గాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ అన్నాడు.

మ్యాచ్ టై అయిందంటే.. విజయం లాంటిదే
‘పిచ్ మాకు ఎంతో సహకరించింది. షెహ్‌జాద్ చాలా బాగా ఆడాడు. ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా బాగుంది. అలాగే మా స్పిన్నర్లు కూడా రాణించారు. భారత్‌లాంటి జట్టుతో మ్యాచ్ టై అయిందంటే.. అది విజయం లాంటిదే. వాళ్లు సులభంగా లక్ష్యాన్ని ఛేదించగలరు .అయినా మ్యాచ్ టైగా ముగిసింది. ఇది అభిమానులను కూడా మంచిదే.' అని అస్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పేర్కొన్నాడు.

తప్పు జరిగిందని చెప్పలేను:
ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు వహించిన ధోనీ స్పందిస్తూ.. ‘తప్పు జరిగిందని నేను చెప్పలేను. అయితే మేం చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చాం. టైగా ముగియడం ద్వారా మాకు చెడు ఏమీ జరగలేదు. మ్యాచ్‌ను మేం కోల్పోయి ఉండేవాళ్లం' అని అన్నాడు.

సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో పాక్-బంగ్లా
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా అంతే స్కోరు చేసి ఆలౌట్ అయింది. బుధవారం జరిగే సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో పాక్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications