
హైదరాబాద్: టెస్టు సిరిస్ అనంతరం భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
దీంతో విశాఖ వన్డేకి సంబంధించి టికెట్ల అమ్మకం ఆదివారం నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి అరుణ్‌కుమార్ తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచామని ఆయన తెలిపారు. విశాఖపట్నం స్టేడియం సీటింగ్ సామర్థ్యం 27,500.
www.eventsnow.com వెబ్‌సైట్‌లో టికెట్ల వివరాలు లభ్యమవుతాయని ఆయన తెలిపారు. రూ.500, రూ.1200, రూ.1800, రూ.2500, రూ.3500, రూ.6000ల ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే వైజాగ్ స్టేడియం ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్, 6 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చింది.
2005లో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ వన్డే సెంచరీని వైజాగ్‌లోనే చేయడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.