Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

58కే ఆలౌట్: చెత్త రికార్డు నమోదు నుంచి తృటిలో తప్పించుకున్న ఇంగ్లాండ్

Thunder Boult destroys England for 58 in 1st Test

హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గురువారం తొలి రోజు ఆట తొలి సెషన్‌లో సంచలన ప్రదర్శన చేశాడు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. దీంతో 20.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 58 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన‌ నేప‌థ్యంలో టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా నిలిచి, టెస్టు క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డును మూటగట్టుకునే స్థితి నుంచి తృటిలో తప్పించుకుంది.

1887లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అత్యంత తక్కువ స్కోరు 45కు ఆలౌటైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇంగ్లాండ్ జట్టు రెండో అతి తక్కువ స్కోరుని నమోదు చేసింది. ఒకానొక దశలో 27 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ పాత రికార్డుని బద్దలు కొడుతుందని అంతా భావించారు.

England vs New Zealand 2018 1st Test స్కోరు కార్డు

అయితే ఇంగ్లాండ్ టెయిలెండర్ బ్యాట్స్‌మన్ ఓవర్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓవర్టన్ ఒంటరి పోరాటం చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 50 పరుగుల మైలురాయిని అందుకుంది. మొత్తంగా ఇది ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆరో అత్యల్ప స్కోరు కావడం విశేషం.

1955లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ అతిస్వల్ప స్కోరు 26కే ఆలౌటై అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ డకౌట్‌గా పెవిలియన్ కు చేరారు. అలెస్టర్ కుక్ 21 బంతులాడి 5 పరుగులు మాత్రమే చేశాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 10.4 ఓవర్లు వేసిన న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 3 ఓవర్లు మెయిడిన్ చేసి 32 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. మరో బౌలర్ టిమ్ సౌథీ(25/4) కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

Story first published: Thursday, March 22, 2018, 12:37 [IST]
Other articles published on Mar 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+