శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు అరుదైన గౌరవం

హైదరాబాద్: మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర బాధ్యతలు స్వీకరించాడు. ఈ క్రమంలో ఈ క్లబ్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బ్రిటీష్‌యేతర వ్యక్తిగా కుమార సంగక్కర అరుదైన ఘనత సాధించాడు. ఈ పదవిలో కుమార సంగక్కర ఏడాదిపాటు కొనసాగనున్నాడు.
ఈ సందర్భంగా కుమార సంగక్కర మాట్లాడుతూ "ఎంసీసీ అధ్యక్షుడి లాంటి ప్రతిష్టాత్మక పదవిని నిర్వహించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది మొత్తం క్రికెట్ వృద్ధికి ఎంసీసీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అన్నాడు. ఎంసీసీతో కుమార సంగక్కరకు సుదీర్ఘ అనుబంధం ఉంది.

2002లో క్వీన్స్ పార్కు వేదికగా
శ్రీలంక పర్యటనలో భాగంగా 2002లో క్వీన్స్ పార్కు వేదికగా ఎంసీసీ క్లబ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరుపున ఆడాడు. 2005లో సునామీ బాధితుల కోసం విరాళాల సేకరణలో భాగంగా లార్డ్స్ వేదికగా అదే క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ ఎలెవన్ జట్టుకు సంగక్కర ప్రాతినిథ్యం వహించాడు.

మేలో లార్డ్స్ వేదికగా
ఈ ఏడాది మేలో లార్డ్స్ వేదికగా జరిగిన ఎంసీసీ వార్షిక జనరల్ మీటింగ్‌లో అధ్యక్ష పదవి నుంచి ఆంటోనీ వ్రఫోర్డ్ తప్పుకోవడంతో కుమార సంగక్కర బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా వ్రఫోర్డ్ మాట్లాడుతూ "ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు కుమార సంగక్కరకు మించిన మరో ఆటగాడు లేడు" అని తెలిపాడు.

2015లో టెస్టులకు వీడ్కోలు
2015లో టెస్టు క్రికెట్‌కు సంగక్కర వీడ్కోలు పలికాడు. 134 టెస్టుల్లో 57.40 యావరేజితో 12,400 పరుగులు చేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకుని కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీలంక తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ ఇతడే. టెస్టుల్లో వరుసగా నాలుగు సార్లు 150 పైగా పరుగులు సాధించాడు.

624 పరుగులతో ప్రపంచ రికార్డు
2006 జూలైలో సంగక్కర మహేలా జయవర్థనేతో కలిసి 624 పరుగులు భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సాధించిన ఈ స్కోరు ఫస్ట్ క్లాన్ మరియు టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. అదే ఇన్నింగ్సులో సంగక్కర వ్యక్తిగతంగా 287 పరుగులు సాధించాడు.

టెస్టుల్లో నాలుగు సార్లు డబుల్ సెంచరీలు
టెస్టుల్లో నాలుగు సార్లు డబుల్ సెంచరీలు పూర్తి చేశాడు. డిసెంబర్, 2007లో వరుసగా 4 సార్లు 150పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గాను రికార్డు సృష్టించాడు. ఇక, లంక తరుపున 213 వన్డేలు ఆడి 36.28 సగటుతో 6277 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో సంగక్కర అత్యధిక స్కోరు 138 నాటౌట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications