Rohit Sharma: రోహిత్ ప్లేస్‌లో జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్ ఇవ్వగల కుర్రాళ్లు వీళ్లు..!

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో పదును తగ్గింది. ఇంగ్లండ్‌లో జరిగిన తొలి వన్డేలో తప్ప మిగతా ఏ మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడినట్లు కనిపించలేదు. అలాగే ఆసియా కప్‌లో కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్ గురించి చెప్పక్కర్లేదు. అతి కష్టం మీద రెండు సార్లు జీవనదానం లభిస్తే.. అదీ నెదర్లాండ్స్ మీద హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుమించి రోహిత్ బ్యాటింగ్‌లో చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ల ఆటతీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగలిగే యువ ఆటగాళ్లపై ఒక లుక్కేద్దామా?

పృథ్వీ షా
ఇటీవలి కాలంలో టీమిండియాకు ఓపెనర్ కావాలి అనగానే గుర్తొస్తున్న పేరు పృథ్వీ షా. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చినట్లు జట్టుకు విధ్వంసకర ఓపెనింగ్ ఇవ్వగలిగే సత్తా షా సొంతం. ఐపీఎల్‌లో తొలి పవర్‌ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 147.45.. మరే ఇతర భారతీయ ఓపెనర్ కూడా కనీసం అతని దరిదాపుల్లో కూడా లేరు. అందుకే చాలా మంది అభిమానులు కూడా కేఎల్ రాహుల్, రోహిత్ వంటి వారి స్థానంలో షాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు.

ఇషాన్ కిషన్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభాలు అందించిన ఇషాన్ కిషన్.. భారత జట్టుకు కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఇంగ్లండ్‌లో అతను విఫలం అవడంతో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లుగా ప్రయత్నించారు. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడతాడని పేరున్న కిషన్‌ను మిడిలార్డర్‌లో పంపాలని కొందరు అంటున్నారు. అయితే స్పిన్‌తోపాటు పేస్‌ను కూడా ఎదుర్కోగలనని అతను ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు.

యశస్వి జైస్వాల్
ఐపీఎల్‌లో ఏ సీజన్‌లోనూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోలేదనే మాటే కానీ.. జైస్వాల్ సాధారణ ఓపెనర్ కాదు. జట్టుకు పవర్‌ప్లేలో అదిరిపోయే ఆరంభాలు అందిస్తూనే.. చివర్లో మంచి ఫినిషింగ్ కూడా ఇవ్వగల సమర్ధుడు. పవర్‌ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 134.55. ఇది మిగతా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (110.82), రిషభ్ పంత్ (124.90), శుభ్‌మన్ గిల్ (120.98) కన్నా ఎక్కువ కావడం గమనార్హం. కానీ వీళ్లందరూ ఏదో ఒక సీజన్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. జైస్వాల్‌కు ఆ అవకాశం రాలేదంతే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications