IPL 2023 : టెస్టు స్పెషలిస్టుపై ఫ్రాంచైజీల కన్ను.. సన్‌రైజర్స్ కూడా..?

చాలా కాలం తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు ఇంగ్లండ్ మాజీ టెస్టు సారధి జో రూట్. టీ20ల్లో అతని రికార్డు బాగానే ఉన్నా.. కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడుతూ వచ్చిన రూట్.. ఇటీవల టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అనంతరం మళ్లీ అన్ని ఫార్మాట్లూ ఆడాలనే ఆశ వెలిబుచ్చిన అతను.. ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇతని కోసం మినీ వేలంలో మూడు జట్లు గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్
సాధారణంగానే అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కొనుగోలు చేయడం కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తుంది. జో రూట్ కూడా అదే కేటగిరీలోకి వస్తాడు. చెన్నై జట్టు దగ్గర ఇద్దరు విదేశీ ప్లేయర్లను కొనుగులో చేసే అవకాశం ఉంది. దీంతో రూట్‌ను కొనుగోలు చేసి జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు చెన్నై ప్రయత్నించొచ్చు. ప్రస్తుతం చెన్నై టాపార్డర్‌లో మంచి సీనియర్ ప్లేయర్ లేడు. ప్రపంచంలో దాదాపు అన్ని రకాల పిచ్‌లపై రాణించిన రూట్.. ఈ సమస్యకు పరిష్కారంలా కనిపిస్తున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్
మినీ వేలంలో భారీ పర్సుతో బరిలో దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రూట్ కోసం ప్రయత్నించే అవకాశాలు బాగానే ఉన్నాయి. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ ఇద్దరినీ ఈ ఫ్రాంచైజీ వదులుకుంది. ఈ క్రమంలో మొత్తం నలుగురు ఓవర్సీస్ ఆటగాళ్ల స్థానాలు ఆ జట్టు వద్ద ఖాళీ అయ్యాయి. దీనికితోడు జట్టు టాపార్డర్ బ్యాటింగ్‌లో పెద్ద లోటు కనిపిస్తోంది. దీన్ని రూట్ కచ్చితంగా భర్తీ చేయగలడు. కావాలంటే ఓపెనింగ్ కూడా చేసి జట్టుకు శుభారంభాలు అందించగల సత్తా రూట్ సొంతం. లేదంటే మూడో స్థానంలో వచ్చి రాణించగలడు. ప్రస్తుతం కెప్టెన్ లేని ఈ జట్టు పగ్గాలను రూట్‌కు అందించినా ఆశ్చర్యం లేదు. అతను అంత అనుభవజ్ఞుడైన నాయకుడే మరి.

పంజాబ్ కింగ్స్
జట్టు మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను కూడా పంజాబ్ కింగ్స్ వదులుకుంది. దీంతో ఆ జట్టు టాపార్డర్‌లో పెద్ద వెలితి ఏర్పడింది. దాన్ని సరిగ్గా భర్తీ చేసే ఆటగాడి కోసం పంజాబ్ వెతుకుతోంది. ఈ పాత్రకు సరిగా సరిపోయే ఆటగాళ్లలో జో రూట్ కూడా ఒకడు. ఈ జట్టుకు ధవన్, బెయిర్‌స్టో ఇద్దరూ ఓపెనింగ్ చేయడం దాదాపు పక్కా. ఇక మూడో స్థానంలో జట్టుకు నిలకడైన ఆటగాడు కావాలి. ఈ స్థానంలో రూట్ కన్నా బెటర్ ఆప్షన్ దొరకడం కష్టం. దానికితోడు పంజాబ్ వద్ద కూడా పర్సులో డబ్బు బాగానే ఉంది. అందుకే రూట్‌ను కొనుగోలు చేయడానికి ఆ జట్టు ప్రయత్నించొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications