For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: భారత్‌లో ఒకే ఒక్కడు.. రెండో టీ20లో మూడు ప్రపంచ రికార్డులు బద్దలు..!

 three records broken in INDvsNZ second T20I

సూర్యకుమార్ విశ్వరూపం చూపడంతో న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. సూర్య అజేయ శతకంతో 191 పరుగులు చేసిన భారత్.. కివీ బ్యాటర్లను 126 పరుగులకే ఆలౌట్ చేసేసింది. ఆ జట్టులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) హాఫ్ సెంచరీ సాధించినా.. భారీ లక్ష్య ఛేదనలో అతను నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో మూడు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే?

ఏకైక భారతీయుడు హుడా..

ఏకైక భారతీయుడు హుడా..

ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బంతితో మాత్రం అదరగొట్టాడు. ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన హుడా.. టెయిలెండర్ల పనిపట్టాడు. వేసింది 2.5 ఓవర్లే అయినా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

పార్ట్ టైమ్ బౌలర్ అయ్యుండి పెద్దగా పరుగులు కూడా ఇవ్వలేదు. తన స్పెల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడంతోపాటు ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హుడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

చెలరేగిన సౌథీ..

చెలరేగిన సౌథీ..

టీ20 క్రికెట్‌లో ఆట బ్యాటర్లకే కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే బౌలర్లకు కూడా తాము షైన్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి. ఇదే అవకాశం టిమ్ సౌథీకి వచ్చింది. భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో చివరి ఓవర్ వేసిన సౌథీ.. హ్యాట్రిక్‌తో చెలరేగాడు.

వరుసగా హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ముగ్గుర్నీ పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు 2010లో పాకిస్తాన్‌పై కూడా సౌథీ ఇలాగే హ్యాట్రిక్ తీసుకున్నాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో ఒకటి కంటే ఎక్కుసార్లు హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ కూడా ఇలాగే టీ20ల్లో రెండుసార్లు హ్యాట్రిక్ తీసుకున్నాడు.

భారత్ భారీ విజయాలు..

భారత్ భారీ విజయాలు..

టీమిండియా ఈ ఏడాది ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 ఈ ఏడాదిలో భారత్ ఆడిన 62వ అంతర్జాతీయ మ్యాచ్. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు మరే జట్టు ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని మ్యాచులు ఆడలేదు. అలాగే కివీస్‌పై 65 పరుగుల తేడాతో భారీ విజయం కూడా నమోదు చేసింది టీమిండియా. ఈ క్రమంలో మరో రికార్డు కూడా బద్లలు కొట్టింది. ఒక ఏడాదిలో పది మ్యాచుల్లో 50పైగా పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. ఈ జట్టు ఇదే ఏడాదిలో ఆరు మ్యాచుల్లో 50పైగా పరుగుల తేడాతో విజయాలు నమోదు చేసింది.

Story first published: Monday, November 21, 2022, 10:44 [IST]
Other articles published on Nov 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+