Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!?

 Three reasons for Team India loss against Bangladesh

కర్ణుడి చావుకు వంద కారణాలు అంటారు. అలాగే బంగ్లా చేతిలో భారత జట్టు ఓటమికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. బంగ్లా ఆటగాళ్ల పట్టుదల, బౌలర్ల అద్భుత ప్రదర్శన ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. కానీ టీమిండియా కొన్ని స్వయం తప్పిదాలు చేయకుండా ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఉండేది. వాటన్నింటినీ పక్కన పెట్టేసి ముందుగా భారత్ ఓటమికి మూడు ప్రధాన కారణాలను పరిశీలిద్దాం.

అది ఫీల్డింగేనా..?

అది ఫీల్డింగేనా..?

ఒకప్పుడు టీమిండియా ఫీల్డింగ్ టాప్‌ గేర్‌లో ఉండేది. ఆటగాళ్లంతా మైదానంలో చిరుతల్లా కదిలేవారు. అలాంటిది బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లీ వంటి వాళ్లు తప్ప మిగతా ఎవరూ ఫీల్డింగ్ చేయడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. మిస్ ఫీల్డ్‌లు చేసి అనవసర పరుగులు ఇవ్వడమే కాకుండా.. కొన్ని క్యాచులు కూడా వదిలేశారు. ముఖ్యంగా 43వ ఓవర్లో మెహదీ హసన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను రాహుల్ వదిలేయడం ఒక పెద్ద షాక్. చేతుల్లోకి వచ్చిన బంతిని అతను వదిలేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ ఒక రెండడుగులు వేస్తే హసన్ ఇచ్చిన మరో క్యాచ్ పట్టేసేవాడు. కానీ అతను కదల్లేదు. దీంతో హసన్‌కు మరో లైఫ్ దక్కింది.

డెత్ బౌలింగ్ ఏది?

డెత్ బౌలింగ్ ఏది?

స్వల్ప లక్ష్యాన్ని కాపాడటంలో భారత బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ఆరంభం నుంచే బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా సిరాజ్ అదరగొట్టాడు. అయితే 40 ఓవర్లకే అతని కోటా పూర్తయింది. మిగతా పది ఓవర్లు వేసిన దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్ ఈ ఫేజ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రీజులో ఉన్నది టెయిలెండర్లు అయినా చాలా డెలివరీలను సరిగ్గా క్రీజు మధ్యలోకి వేశాడు. వాటిని సులభంగా స్క్వేర్ ఫీల్డర్ వెనక్కు పంపి పరుగులు పిండుకున్నాడు. దీనిపై ఫ్యాన్స్ కూడా మండి పడుతూ ఒక్కటంటే ఒక్క యార్కర్ కూడా వెయ్యలేదు? అసలు ఈ జట్టులో డెత్ బౌలర్ ఎవరు? అంటూ నిలదీశారు.

బ్యాటింగ్ వైఫల్యం..

బ్యాటింగ్ వైఫల్యం..

టీమిండియా ప్రధాన బలం బౌలింగ్ కాదు.. బ్యాటింగ్. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి హేమాహేమీలతో కూడిన భారత బ్యాటింగ్.. బంగ్లా స్పిన్నర్ల వలలో చిక్కుకొని విలవిల్లాడింది. వీళ్లు ముగ్గురూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఈ ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్.. మరోసారి తన చిరకాల శత్రువు షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకున్నాడు. ఆల్‌రౌండర్లుగా వచ్చిన షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు పెద్ద స్కోరు చెయ్యలేదు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కూడా లేకపోతే ఈ ఓటమి మరింత ఘోరంగా ఉండేదే.

Story first published: Monday, December 5, 2022, 15:04 [IST]
Other articles published on Dec 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+