Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: RCBలో ఈ బ్యూటీఫుల్ లేడీస్ డౌటే!

మరో మూడు రోజుల్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ తో ఓపెనింగ్ మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ సారి ఆర్సీబీలో కొంతమంది స్టార్ ప్లేయర్స్ గాయాలబారిన పడటం కాస్త ఆందోళన కలిగించే విషయమే.

ఇప్పటికే సోఫీ డిఫైన్ వ్యక్తిగత కారణాలతో ఆటకు కాస్త బ్రేక్ తీసుకుంది. స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండట్లేదు. కేట్ క్రాస్ కూడా గాయం కారణంగా తప్పుకుంది. ఇక రీసెంట్ గా యాషెస్ సిరీస్ లో గాయపడి కోలుకున్న ఆల్ రౌండర్ ఎల్లిసె పెర్రీ మళ్లీ జట్టుతో కలిసింది. కానీ ఆమె ఇంకా పూర్తిగా ఫిట్ నెస్ సాధించినట్లు కనిపించట్లేదు. దీంతో మోలినెక్స్ స్థానంలో చార్లీ డీన్(ఇంగ్లాండ్), డివైన్, క్రాస్ స్థానంలో హీథర్ గ్రహమ్, కిమ్ గర్త్ ను తీసుకొచ్చారు.

Three RCB players Ellyse Perry Sabbhineni Meghana Danni Wyatt not in form ahead of WPL 2025

అయితే గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మిగతా ప్లేయర్స్ తో భర్తీ చేసి, పేపర్ మీద బలంగా కనిపిస్తోన్న ఆర్సీబీలో.. కొంతమంది ప్లేయర్స్ ఫామ్ లో లేకపోవడం కూడా కలవరపెడుతోంది. ఇంతకీ వారెవరంటే?

1.ఎల్లిస్ పెర్రీ
ఆర్సీబీ 2024 సీజన్ విజయంలో కీలకంగా వ్యవహరించన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రి.. ప్రస్తుతం అంతగా ఫామ్ లో కనిపించట్లేదు. రీసెంట్ గా యాషెస్ సిరీస్ లో మూడు వన్డేలో కేవలం 76 పరుగులే చేసింది.అందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మూడు టీ20ల్లో అయితే కేవలం 21 పరుగులే చేసింది. ఒక టెస్ట్ లో ఒక ఇన్నింగ్స్ లో రెండు పరుగులే చేసింది. చూడాలి మరి గాయపడిన ఈ ఎల్లిస్ పెర్రీ.. పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధించి, డబ్ల్యూపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.

2.సబ్బినేని మేఘన
2024సీజన్ లో 28 ఏళ్ల సబ్బినేని మేఘన... ఆరు ఇన్నింగ్స్ లో 168 పరుగులు చేసింది. అందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అయితే 2022లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. రీసెంట్ గా ఫామ్ కోల్పోయిది. సీనియర్స్ ఉమెన్స్ టీ20 ట్రోఫలో ఏడు ఇన్నింగ్స్ లో 11.29 యావరేజ్ తో కేవలం 79 పరుగులు మాత్రమే చేసింది. అందులో 25 తన టాప్ స్కోర్. అలానే సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీలోనూ ఆమె ఏడు ఇన్నింగ్స్ లో 23.83 యావరేజ్ తో 143 పరుగులు చేసింది. అందులో 41 ఆమె అత్యధిక స్కోరు.

3.డాని వ్యాట్ హోడ్జే
ఇంగ్లాండ్ బ్యాటర్ డాని వ్యాట్ హోడ్జే ఈ సీజన్ తో డబ్ల్యూపీఎల్ డెబ్యూ ఇవ్వనుంది. ఈమె 2025 యాషెస్ సిరీస్ లో పరుగులు చేయడానికి కష్టపడింది. మూడూ వన్డేల్లో 73 పరుగులు చేయగా.. మూడు టీ20ల్లో కేవలం 69 రన్స్ చేసింది. ఒక్క టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 24 పరుగులే చేసింది. అలా ప్రస్తుతం ఆమె ఫామ్ లో లేక ఇబ్బంది పడుతోంది.

Story first published: Tuesday, February 11, 2025, 16:29 [IST]
Other articles published on Feb 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+