For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ముగ్గురు బ్యాటర్లు.. మూడు రికార్డులు.. తొలి వన్డేలో బద్దలవుతాయా?

 These three players are near key milestones. They will break them in first INDvsAUS ODI.

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డేకు వేదిక సిద్ధమైంది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారధ్యంలో ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. అదే సమయంలో ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఆడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టేందుకు ముగ్గురు ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. వాళ్లెవరంటే..

ఈ ఏడాది తొలి ప్లేయర్..

ఈ ఏడాది తొలి ప్లేయర్..

ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పేరు చెప్పాలి. అన్ని ఫార్మాట్లలో చెలరేగుతున్న అతను ఈ ఏడాదిలోనే వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ కూడా సాధించాడు. ఈ క్రమంలో ఒక కీలకమైన మైలురాయికి గిల్ చేరువయ్యాడు. ఈ ఏడాది వేగంగా వెయ్యి అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు చేరువయ్యాడు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో గిల్ 923 పరుగులు చేశాడు. తొలి వన్డేలో కనీసం 77 పరుగులు చేస్తే.. ఈ ఏడాది వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పుతాడు.

5 వేల వన్డే పరుగులు..

5 వేల వన్డే పరుగులు..

ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా తన కెరీర్‌లో మరో కీలక మైలురాయి చేరుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు 139 అంతర్జాతీయ వన్డేలు ఆడిన అతను 45.11 సగటుతో 4917 పరుగులు చేశాడు. అంటే అంతర్జాతీయంగా 5 వేల పరుగులు పూర్తి చేసేందుకు స్మిత్ చేరువలో ఉన్నాడన్నమాట. తొలి వన్డేలో (INDvsAUS) అతను 83 పరుగులు చేశాడంటే ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన 17వ బ్యాటర్‌గా స్మిత్ నిలుస్తాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతను తొలి వన్డేలోనే ఈ మైలురాయి చేరుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆసీస్‌పై చెలరేగడమే..

ఆసీస్‌పై చెలరేగడమే..

ప్రపంచ క్రికెట్‌లో క్వాలిటీ టీమ్స్ పేర్లు చెప్తే వీటిలో కచ్చితంగా ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. అలాంటి క్వాలిటీ టీంను ఎదుర్కునేటప్పుడు కోహ్లీ (Virat Kohli) ఎప్పుడూ తన ఎ-గేమ్ ఆడతాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచుల్లో కోహ్లీ ఇప్పటి వరకు 2083 పరుగులు చేశాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రికీ పాంటింగ్ తర్వాత కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ ఈ సిరీసుల్లో 2164 పరుగులు చేసి ఉన్నాడు. తొలి వన్డేలో కనుక కోహ్లీ 82 పరుగులు చేస్తే.. పాంటింగ్‌ను దాటేస్తాడు. ఈ జాబితాలో 3077 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Friday, March 17, 2023, 10:15 [IST]
Other articles published on Mar 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+