Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : ఈ ముగ్గురిపై అందరి ఫోకస్.. ఆడకపోతే అంతే సంగతులు!

Three players who will be in focus for INDvsSl ODIs

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధం అవుతోంది. గువాహటి వేదికగా జరిగే తొలి వన్డేను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడంపై అభిమానులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అయితే తొలి వన్డేలో మూడు విషయాలపై అందరి ఫోకస్ పెరగనుంది. అవేంటంటే..

ఓపెనర్‌గా గిల్ పెర్ఫామెన్స్

ఓపెనర్‌గా గిల్ పెర్ఫామెన్స్

భారత జట్టు చివరగా ఆడిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను కాదని శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డేలో గిల్ ప్రదర్శనను అందరూ భూతద్దంలో చూడటం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన గిల్ కనుక వన్డేల్లో కూడా విఫలమైతే.. అతనిపై విపరీతమైన ట్రోలింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వన్డేల్లో గిల్ ప్రదర్శన బాగానే ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.

పాండ్యా బౌలింగ్ కీలకం

పాండ్యా బౌలింగ్ కీలకం

చాలా గ్యాప్ తర్వాత టీమిండియా తరఫున హార్దిక్ పాండ్యా వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత సూపర్ ఫామ్‌ కొనసాగిస్తున్న అతను.. టీ20ల్లో అత్యద్భుతంగా రాణించాడు. యువ బౌలర్లతో కలిసి కొత్త బంతిని పంచుకున్న అతను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు కీలక వికెట్లు కూడా తీశాడు. అదే ఫామ్‌ను వన్డే ఫార్మాట్‌లో కూడా అతను కొనసాగిస్తే అభిమానులకు పండగే. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా చాలా కీలకం కానున్నాడు. అతను కనుక 7-8 ఓవర్లు బౌలింగ్ చేసినా దాని ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడే అవకాశం ఉంది.

రాహుల్ ఫామ్

రాహుల్ ఫామ్

తొలి వన్డే ఆడే జట్టులో కేఎల్ రాహుల్‌ను ఆడించడం కోసమే ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా వికెట్ కీపర్‌గా రాహుల్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మినహా మిగతా మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన అతనికి శ్రీలంక సిరీస్ కీలకం కానుంది. రాహుల్ కనుక ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వీళ్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు కూడా. టెస్టుల్లో కూడా రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోని సంగతి తెలిసిందే. దీంతో అతను అసలు జట్టులో పనికిరాడంటూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. వాళ్లందరికీ రాహుల్ తన బ్యాటుతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, January 10, 2023, 10:16 [IST]
Other articles published on Jan 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+