
గతేడాది నుంచి ఏం నేర్చుకున్నాం?
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పుడు గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో కూడా పది వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తయింది. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో మిగతా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి పడింది. దీంతో కోహ్లీ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత భారత జట్టు చిత్తుగా ఓడింది. ఈ ఓటమి నుంచి భారత జట్టు ఏమీ నేర్చుకోలేదు. ఈసారి కూడా టోర్నీల అత్యంత నెమ్మదైన ఓపెనింగ్స్ నమోదు చేసింది.

ఐపీఎల్‌లో టాప్ స్టార్టర్లు
టీమిండియాలోకి రావడానికి ఐపీఎల్‌ను కూడా మంచి వేదికగానే యువ ఆటగాళ్లు చూస్తారని తెలిసిందే. అసలే టీమిండియా కష్టాల్లో ఉంది. దానికితోడు మరో ప్రపంచకప్ వస్తోంది. ఈ క్రమంలోనే పలువురు యువ ఆటగాళ్లు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నించారు. ఐపీఎల్‌లో ఎడాపెడా బంతులను బౌండరీలకు తరలిస్తూ అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు.

సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ సారధిగా ఉన్న సంజూ శాంసన్ వన్ డౌన్‌లో బ్యాటింగ్ వస్తూ అదరగొట్టాడు. ఆరంభంలో ఒక ఓపెనర్ పెవిలియన్ చేరగానే మైదానంలో దిగిన సంజూ.. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. సంజూ ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. ఐపీఎల్ కెరీర్ ఆసాంతం ఎటాకింగ్ గేమ్ ఆడిన అతను.. 2021 నుంచి తను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లోనే 140పైగా స్ట్రైక్‌రేటు, 40 సగటుతో 643 పరుగులు చేశాడు.

రాహుల్ త్రిపాఠీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్‌కు వెన్నెముకలా మారిన రాహుల్ త్రిపాఠీ కూడా ధనాధన్ ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఇతను కూడా 2021 నుంచి ఐపీఎల్‌లో తను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో భారీ షాట్లు ఆడుతూనే వచ్చాడు. మొత్తం 147పైగా స్ట్రైక్‌రేటు, 40 సగటుతో 597 పరుగులు చేశాడు.

పృథ్వీ షా
ఈ డ్యాషింగ్ ఓపెనర్ గురించి ఎక్కువగా చెప్పాల్సి అవసరం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా ఎలాంటి విధ్వంసకరమైన ఓపెనింగ్‌లు అందించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్‌ప్లేలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకోవడంలో పృథ్వీ షా దిట్ట. తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగే అతను కూడా 2021 నుంచి ఐపీఎల్‌లో తను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో ఏకంగా 161 స్ట్రైక్ రేటు, 42 సగటుతో 587 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో షా పెర్ఫామెన్స్ చూసిన వాళ్లంతా అతనికి కచ్చితంగా టీమిండియాలో చోటు దక్కుతుందని అనుకున్నారు.

జట్టులో దక్కని చోటు
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ కష్టాలను పట్టించుకోని సెలెక్షన్ కమిటీ.. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ ముగ్గురికీ కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ కోసం వీళ్లను ఎంపిక చేయలేదు. పాత చింతకాయ పచ్చడిలా గతేడాది ఆడిన వారినే సెలెక్ట్ చేసింది. దీంతో ఫలితం కూడా అదే మాదిరి వచ్చింది. దీంతో గతేడాది వైఫల్యం నుంచి భారత జట్టు ఏం నేర్చుకుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications












