Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvENG: సెమీఫైనల్‌లో ప్లేయర్ల మధ్య వైరం.. మినీ మ్యాచ్‌లతో అభిమానులకు పండగే!

 three player battles to look forward to in INDvsENG semifinal

టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. ఒక జట్టు ఫైనల్ కూడా చేరింది. ఫైనల్‌లో పోరాడేందుకు ఇంగ్లండ్, భారత్ పోటీ పడుతున్నాయి. గురువారం నాడు అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడుతోంది. ఇలా రెండు బలమైన జట్లు తలపడినప్పుడు ఆయా జట్లలోని ఆటగాళ్ల మధ్య ఉండే పోటీ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అలా ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో జరిగే ఈ మినీ మ్యాచులు ఫ్యాన్స్‌లో మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.

బట్లర్ వర్సెస్ భువనేశ్వర్

బట్లర్ వర్సెస్ భువనేశ్వర్

ఈ ప్రపంచకప్‌లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడైన బట్లర్.. భువీ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటంలో విఫలమవుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు బట్లర్‌ను భువీ అంతర్జాతీయ టీ20ల్లో ఐదుసార్లు అవుట్ చేశాడు. భువీ బౌలింగ్‌లో బట్లర్ స్ట్రైక్ రేట్ కూడా కేవలం 93గానే ఉండటం గమనార్హం. వీళ్లిద్దరి మధ్య పోటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కోహ్లీ వర్సెసర్ రషీద్

కోహ్లీ వర్సెసర్ రషీద్

ప్రస్తుతం స్టెల్లార్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌ మ్యాచుల్లో ఒక్కసారి కూడా అవుటవ్వలేదు. దానికితోడు అడిలైడ్ అతనికి అచ్చొచ్చిన స్టేడియం. అందుకే అదరి ఫోకస్ ఈ మ్యాచ్‌లో కోహ్లీపై ఉంటుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ గండం తప్పించుకునేందుకు ఇంగ్లండ్ జట్టు అదిల్ రషీద్‌ను రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది. టీ20 క్రికెట్‌లో రషీద్ బౌలింగ్‌లో 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 63 పరుగులు చేసి రెండుసార్లు అవుటయ్యాడు. ఇది కూడా ఆసక్తి రేపుతున్న పోటీనే.

సూర్యకుమార్ వర్సెస్ శామ్ కర్రాన్

సూర్యకుమార్ వర్సెస్ శామ్ కర్రాన్

ఎప్పుడైనా బెస్ట్ వర్సెస్ బెస్ట్ మధ్య పోటీనే అందరికీ కిక్ ఇస్తుంది. ఈ లెక్కన టీమిండియాలో ప్రస్తుత బెస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ బెస్ట్ బౌలర్ శామ్ కర్రాన్ మధ్య పోటీ అభిమానులకు కావల్సినంత కిక్ ఇస్తుందనడం అతిశయోక్తి కాదు. ఇంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో శామ్ కర్రాన్‌ బౌలింగ్‌లో కేవలం 13 పరుగులు చేసిన సూర్య.. రెండు సార్లు అవుటయ్యాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటికే 6.40 ఎకానమీతో పది వికెట్లు తీసిన కర్రాన్.. సూర్య ప్రతాపానికి వణికిపోతే చూడాలని ప్రతి భారత అభిమానీ కోరుకుంటున్నాడు.

Story first published: Thursday, November 10, 2022, 10:37 [IST]
Other articles published on Nov 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+